వెంకటాపురం(కె): మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్లవాగు సమీపంలో బ్రిడ్జి కుంగిపోవటంతో వాగులో నుంచి తాత్కాలికంగా రోడ్డును వేశారు. వాహనాల రాకపోకలతో వాగులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు గుంతలమయంగా మారటంతో పాటు వాహనాలు రోడ్డు పై దిగబడుతున్నాయి. సోమవారం రోడ్డుపై మట్టిపోసి డోజర్‌తో చదునుచేసే పనులు చేపట్టారు. దీంతో సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇసుక లారీలు భారీగా వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.