ఆరోగ్యం పదిలమేనా..? | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం పదిలమేనా..?

Apr 13 2025 1:09 AM | Updated on Apr 13 2025 1:09 AM

ఆరోగ్యం పదిలమేనా..?

ఆరోగ్యం పదిలమేనా..?

చిన్నారుల హెల్త్‌పై ప్రత్యేక దృష్టి

కాటారం: అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్తున్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఆరేళ్లలోపు చిన్నారుల్లో కంటి, మానసిక సమస్యలను ముందస్తుగా గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వరల్డ్‌ హెల్త్‌ డే సందర్భంగా జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి వైద్య సిబ్బంది శ్రీకారం చుట్టారు. మూడు నెలల కాలంలో జిల్లాలోని అంగన్‌వాడీల్లోని మొత్తం చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

10,364 మంది చిన్నారులు

జిల్లాలోని 643 అంగన్‌వాడీ కేంద్రాల్లో 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గల 10,364 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కంటి, మానసిక సమస్యల గుర్తింపు పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు రెండు విడతల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో విడతగా అంగన్‌వాడీ చిన్నారులకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల చిన్నారులే ఎక్కువగా అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నారు. సరైన పర్యావేక్షణ లేకపోవడంతో వీరిలో కంటి, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వీటిని చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఓ యోచనకు వచ్చింది.

ప్రతీ చిన్నారికి వైద్య పరీక్షలు..

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్ల లోపు చిన్నారులు ప్రతీ ఒక్కరి కంటి, మానసిక వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. నాలుగు బృందాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోజుకు 80 నుంచి 100 మంది చిన్నారులను పరీక్షిస్తున్నారు. సమస్య గుర్తించిన వారికి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటాం. ఈ వైద్య పరీక్షలు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.

– డాక్టర్‌ ప్రమోద్‌, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి

జిల్లా వివరాలు..

అంగన్‌వాడీల్లో ఆరోగ్య పరీక్షలు

జిల్లాలో నాలుగు బృందాల ద్వారా

వైద్య పరీక్షలు

మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక

రోజుకు 80 నుంచి 100 మందికి..

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల్లో అనారోగ్య, పౌష్టికాహార సమస్యలను నివారించేందుకు బాలామృతం, కోడిగుడ్లు లాంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అయినప్పటికీ చిన్నారుల్లో నేత్ర సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో వైద్యపరీక్షలు కీలకం అని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు వైద్య బృందాలు ప్రతి రోజు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి 80 నుండి 100 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించి వారి మానసిక, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వైద్యబృందం గుర్తించిన అంశాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,500 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement