రాష్ట్రస్థాయికి జంతుశాస్త్ర పరిశోధన ప్రాజెక్ట్ ఎంపిక
ములుగు: ఇంపాక్ట్ ఆఫ్ సాయిల్ ఆర్థోపోర్డ్స్ ఇన్ చిల్లీ క్రాప్ ఇన్ జాకారం విలేజ్ ఆఫ్ ములుగు డిస్ట్రిక్ అంశంపై చేసిన పరిశోధన రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా ఖైరతాబాద్‌లో ప్రదర్శించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం తెలిపారు. జిజ్ఞాస స్టూడెంట్ స్టడీస్ ప్రాజెక్టు పోటీలలో జంతుశాస్త్ర విద్యార్థుల ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు పాలెం పునీత, పల్లెపు శృతి, బైరి కావ్య, సయ్యదబీబీ, రబియాలను ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలయ్య, అకాడమీ కో ఆర్డినేటర్ భాస్కర్, న్యాక్ కో ఆర్డినేటర్ కవిత, అధ్యాపకురాలు సరిత, నాగమణి, శిరీష, రాధిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment