బయోమెట్రిక్ ప్రకారమే వేతనాలు
భూపాలపల్లి: బయోమెట్రిక్ హాజరు ప్రకారమే సిబ్బందికి వేతన చెల్లింపులు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో అన్ని శాఖల అధికారులతో కలిసి బయోమెట్రిక్ హాజరు పరికరాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం నిర్దేశిత సమయం ప్రకారం బయోమెట్రిక్ హాజరు నమోదుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మిల్లెట్ కౌంటర్ అందుబాటులో ఉండాలి..
మిల్లెట్ కౌంటర్ ప్రతీరోజు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ డీఆర్‌డీఓ నరేష్‌కు సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ కౌంటర్‌ను పరిశీలించారు.
వాటర్ షెడ్ యాత్ర విజయవంతం చేయాలి..
ఈ నెల 29న జిల్లాలో నిర్వహించే వాటర్‌షెడ్ యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో వాటర్‌షెడ్ యాత్ర నిర్వహణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో నీటి వినియోగం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఈ నెల 22న ఆదిలాబాద్‌లో మొదలైన యాత్ర 29వ తేదీన జిల్లాలో కొనసాగుతుందని తెలిపారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి..
క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించగలమని అన్నారు. సమీక్ష అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన క్షయ వ్యాధి అవగాహన స్టాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, వైద్యాధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఈవీఎం గోదాంను పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై నిరంతర పటిష్ట పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment