లీకేజీ సమస్యకు పరిష్కారం
పలిమెల: సర్వాయిపేటలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘తాగునీటి తండ్లాట’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు గ్రామంలో పగిలిన పైప్‌లైన్ వద్ద మరమ్మతులు చేపట్టారు. నీటి పంపిణీని పునరుద్ధరించినట్లు మిషన్ భగీరథ ఏఈ సాయిరాం తెలిపారు.
ఇంటి చుట్టూ ఉచ్చుతీగలు
కాటారం: మండలంలోని గూడూరులో ఓ ఇంటి చుట్ట్టూ వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చు తీగలను పలువురు గుర్తు తెలియని దుండగులు అమర్చిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సదాశివ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసే సరికి ఇంటి ముందు ఉచ్చు తీగ అమర్చి సమీపంలోని విద్యుత్ స్తంభానికి తీగలను తగిలించి ఉంది. ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై–2 శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరైనా హత్యాయత్నానికి ప్రయత్నించారా, లేక గ్రామ శివారులో ఉండటంతో వన్యప్రాణుల వేట కోసం ఉచ్చుతీగ బిగించి ఉంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
విద్యుత్ అధికారుల
పొలంబాట
రేగొండ: విద్యుత్ అధికారులు రైతులకు సహాయకారులుగా ఉండాలని ఎస్‌ఈ మల్సూర్ నాయక్ అన్నారు. మండలంలోని రామన్నగూడెం తండాలో సోమవారం నిర్వహించిన పొలంబాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్‌పైన ఉన్న లూస్ లైన్‌లను సరి చేసి పోల్‌కు పోల్ తగలకుండా స్పేసర్స్ బిగించుట వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రైతులు తడి చేతులతో స్టార్టర్ బాక్స్‌లు ముట్టుకోవద్దని సూచించారు. ఐరన్ స్టార్టర్ బాక్స్‌లకు బదులుగా ప్లాస్టిక్ స్టార్టర్స్‌ను వినియోగించాలన్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ నాగరాజు, ఏఈ రాజు, ఏఎల్‌ఎమ్ రాహుల్, విజయ్‌కుమార్, రైతులు దేవేందర్, శ్యామరావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
రామప్ప ఒగరుకాల్వకు
బుంగ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధాన కాల్వ ఒగరుకాల్వకు అదివారం రాత్రి బుంగపడింది. ప్రధాన తూము సమీపంలోనే బుంగపడి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి నీరంతా చేరడంతో కొంతమేర మునిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న నీటి పారుదల శాఖ ఈఈ నారాయణ, డీఈ రవీందర్‌రెడ్డి, ఏఈ జయంతిలు బుంగ పడిన ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. ఈ క్రమంలో ఒగరుకాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. తొందరలోనే బుంగ పడిన ప్రదేశానికి మరమ్మతులు చేపట్టి కాల్వ ద్వారా ఆయకట్టు పంట పొలా లకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.
లీకేజీ సమస్యకు పరిష్కారం
లీకేజీ సమస్యకు పరిష్కారం
లీకేజీ సమస్యకు పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment