ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
కాళేశ్వరం: ప్రతియేటా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న తీరు ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిచివేస్తున్న తరుణంలో.. అక్షయ పాత్ర లాంటి ఆణిముత్యం తన విజ్ఞాన ప్రదర్శన ప్రతిభతో ఒక్కసారిగా తళుక్కున మెరిసి అందరినీ సర్కారు బడి వైపు చూసేలా చేస్తుంది. అతికష్టమైన భౌతికశాస్త్రం సబ్జెక్టులో తన గైడ్ టీచర్ ‘దశావధానం’ అనే అంశంపై ప్రోత్సాహం ఇవ్వడంతో తర్పీదు తీసుకుంది. తన ప్రతిభకు సానపెట్టి జ్ఞాన సంపదను పెంచుతూ సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నాంచర్ల అక్షయ తన ప్రతిభతో సర్కారు బడిపై ఆశలు సన్నగిల్లకుండా పదికాలాలు పటిష్టం చేస్తుంది.
దశావధానం అంటే..
ప్రపంచంలో ఏ భాషకు లేని ప్రత్యేకత తెలుగు భాషకు మాత్రమే ఉంది. దశావధానం, అష్టావధానం, శతావధానం, సహస్రావధానంతో కవులు, రచయితలు తెలుగుభాషకే వన్నె తెచ్చారు. తెలుగు భాషకే పరిమితమై అవధాన ప్రక్రియను భౌతికశాస్త్రంలో చేస్తే ఎలా ఉంటుందని పాఠశాల ఫిజిక్స్ టీచర్ దొనికల రాజేందర్ వినూత్నంగా ఆలోచించి, ప్రయోగం చేశారు. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడి పిల్లల్లో సృజనాత్మకతను బయటకు తీసుకురావాలనే ఆలోచనతో భౌతికశాస్త్రంలో న్యూటన్ గమన నియమాలపై తెలుగు దశావదానానికి లింకు కలిపారు. 9వ తరగతి విద్యార్థిని అక్షయ చదువులో రాణిస్తున్న తీరుతో ఆమైపె దృష్టిసారించారు. ఆమెకు భౌతికశాస్త్రంపై పట్టు ఉండడంతో సానపట్టి ఆణిముత్యాన్ని తయారు చేశారు.
పదిమంది ప్రశ్నలతో..
పదిమంది ప్రశ్నలు వేస్తారు. ఎనిమిది మంది సంబంఽధిత విషయాలకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తారు. మరో ఇద్దరిలో ఒక్కరు అప్రస్తుత ప్రసంగం చేసి ఆమెను డైవర్ట్ చేస్తారు. మరొకరు సమాధానాలు చెబుతున్న క్రమంలో ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. వేదికపై కొనసాగుతున్న అంశంపై సంబంధంలేని అంశం చేసి అలర్ట్, డైవర్ట్ చేస్తారు. అప్పటికప్పుడు చతురోక్తులతో కూడిన సమాధానాలు ఇస్తూ అడిగిన ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు ఇవ్వడం ప్రత్యేకత.
న్యూటన్ గమన నియమాలపై
ప్రశ్నలు, జవాబులు
● ప్రశ్నకు జవాబు చెప్పడం
● సమాధానాలకు అనువుగా ప్రశ్నలను తయారు చేయడం
● చూపించిన పటంలో దాగున్న న్యూటన్ గమన నియమాన్ని చెప్పడం
● చూపించిన పరికరాలతో ఏ కృత్యం చేయవచ్చునో.. దానిలో దాగున్న నియమాన్ని వివరించడం
● ఇచ్చిన నాలుగు పదాలతో న్యూటన్ గమన నియమాలు అంతర్గతంగా ఉండేలా ఒక కథను చెప్పడం, అందులోని సందర్భాలలో దాగి ఉన్న నియమాలను వివరించడం
● నిర్వహించిన కృత్యంలో గమన నియమాలను వివరించడం
● పెన్ను పేపర్ ఉపయోగించకుండా గమన నియమాల ఆధారంగా ఇచ్చిన వివరాలతో సమస్యను పరిష్కరించడం
● పటాన్ని చూసి శాస్త్రవేత్తను గుర్తించడం
● ఒక పటం లేదా అంశాన్ని గురించి ఏ పేజీలో ఉందో చెప్పడం
● మధ్య మధ్యలో అప్రస్తుత ప్రసంగంతో ఆటంక పరచడం మొదలగు పది అంశాలతో నిర్వహించిన తీరు భౌతికశాస్త్రం ఉపాధ్యాయుల బృందాన్నే సంబ్రమాశ్చర్యంలోకి దించి అబ్బురపరిచింది విద్యార్థిని అక్షయ. ఇటీవల పాఠశాలకు వచ్చిన భూపాలపల్లి భౌతికశాస్త్రం ఫోరం ఉపాధ్యాయులతో ప్రతిభ ప్రదర్శించి ఔరా అనిపించుకుంది.
సృజనాత్మకత బయటకు తీయాలనే..
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను బయటకు తీయాలని వినూత్నంగా ఆలోచన చేసిన. దానికి అనుగుణంగా నాకు అక్షయ లాంటి ఆణిముత్యం లభించింది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌డే సందర్భంగా ప్రయత్నం చేసిన. తెలుగు భాషలో కవులు, రచయితలు వాడే దశావధానం లాంటిదే భౌతికశాస్త్రంలో న్యూటన్ మూడో గమన నియమాలపై చేయాలని పట్టుదలతో శిక్షణ ఇచ్చి ప్రదర్శించాం. అద్భుత ప్రదర్శన అమోఘం, అనితర సాధ్యం. ఇలాంటి ప్రదర్శన నాకు తెలిసి ఎవరూ చేయలేదు.
– దొనికల రాజేందర్, ఫిజికల్‌సైన్స్
ఐఐటీ సీటు లక్ష్యం
నా గైడ్ టీచర్ రాజేందర్ సార్ ప్రోత్సాహంతో న్యూటన్ గమన నియమాలపై దశావధానం చేసిన. మా హెచ్‌ఎం అన్నపూర్ణ మేడం సహకారం మరువలేనిది. ఆమె నిత్యం చదువుపై శ్రద్ధ, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూస్తుంది. పాఠశాలలోని టీచర్లు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. భవిష్యత్‌లో ఐఐటీ ముంబయిలో సీటు లక్ష్యంగా చదువుతున్నాను. ప్రభుత్వ బడులపై చిన్నచూపు చూడొద్దు.
– నాంచర్ల అక్షయ, 9వ తరగతి
●
న్యూస్‌రీల్
న్యూటన్ గమన నియమాలపై
విద్యార్థిని ప్రదర్శన
భౌతికశాస్త్రం ఉపాధ్యాయులకే మిరాకిల్ అనిపించేలా..
ప్రశ్నలకు జవాబులు,
ప్రశ్నలు తయారు చేయడం ప్రత్యేకత
ప్రభుత్వ బడిలో మెరిసిన ఆణిముత్యం
అక్షయ.. అవధాని
అక్షయ.. అవధాని
అక్షయ.. అవధాని
అక్షయ.. అవధాని
అక్షయ.. అవధాని
అక్షయ.. అవధాని
అక్షయ.. అవధాని
అక్షయ.. అవధాని