కుష్ఠు వ్యాధి నిర్మూలనకు సహకరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూళనకు సహకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న సర్వేను విజయవంతం చేయాలని కోరారు. కుష్ఠు వ్యాధి సర్వే, నిర్మూళనపై జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు, అనుమానితులను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటింటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాధి లక్షణాలు ఉంటే తెలియజేయాలని కోరారు. వ్యాధిబారిన పడిన వారికి ప్రభుత్వం తరఫున రూ.12వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు రవిరాథోడ్, శ్రీదేవి, ఉమాదేవి, సిబ్బంది మల్లయ్య, శ్రీదేవి పాల్గొన్నారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
డాక్టర్ మధుసూదన్