భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో ఫిబ్రవరి మాసంలో 85శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాకు గడిచిన మాసంలో 4.55లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 3.90లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 85శాతంలో నిలిచినట్లు తెలిపారు. వెలికితీసి బొగ్గులో 3.27లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు చెప్పారు. మార్చి మాసానికి 6.39లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంచే విధంగా కార్మికులు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంజూర్‌నగర్‌లోని ఇల్లంద క్లబ్‌హౌజ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment