సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): విద్యుత్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్–2 సీఈ రాజ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లైన్‌మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెల్తుర్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను వినియోగదారులకు అందించాలన్నారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలని చెప్పారు. సమ్మర్ యాక్షన్‌లో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బందికి పలు సూచనలు అందించారు. అనంతరం వెల్తుర్లపల్లి సబ్‌స్టేషన్‌లో ఫెయిల్ అయిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఈ సదానందం, ములుగు ఏడీఈ ఆపరేషన్ వేణుగోపాల్, ఏడీఈ కన్‌స్ట్రక్షన్స్ సందీప్ పటేల్, ఏఈలు రమేశ్, బెనర్జీ, సబ్ ఇంజనీర్ సాంబరాజు పాల్గొన్నారు.
రాజ్ చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment