భూపాలపల్లి రూరల్: పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 21మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలతో పోలీసుస్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని తెలిపారు.
ఎస్పీ కిరణ్ ఖరే