కోటగుళ్లను సందర్శించిన ఇటలీ ఆర్కిటెక్చర్ బృందం
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లను సోమవారం ఇటలీ దేశానికి చెందిన ఆర్కిటెక్చర్ బృందం సందర్శించింది. ఇటలీకి చెందిన రార్టో, మేఘా ఆధ్వర్యంలో ఆర్కిటెక్చర్ బృందం సందర్శించి మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం కోటగుళ్ల శిల్పసంపదను కెమెరాల్లో చిత్రీకరించుకున్నారు. ఆలయ శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈఓ రాజేందర్ సోమవారం తనిఖీ చేశారు. కాటారం ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, మహదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలురు, బాలికల పాఠశాలను సందర్శించారు. రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పరీక్షలకు సోమవారం 3,449 విద్యార్థులకు 3,435 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
క్రికెట్ బెట్టింగ్‌లకు
పాల్పడొద్దు
● కాటారం డీఎస్పీ
గడ్డం రామ్మోహన్‌రెడ్డి
కాళేశ్వరం: ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు, యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహదేవపూర్ పోలీసుస్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్‌లు చట్టవిరుద్ధమన్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని, రోడ్డున పడొద్దన్నారు. యువత, అభిమానులు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట సీఐ రామచందర్‌రావు, ఎస్సైలు పవన్‌కుమార్, తమాషారెడ్డి, రమేష్ ఉన్నారు.
27న ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’
మొగుళ్లపల్లి: ఈ నెల 27న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే బీసీల మహాధర్నాకు వేలా దిగా తరలివచ్చి హలో బీసీ.. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదింపజేయడాన్ని స్వాగతిస్తున్నామన్నా రు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి బీసీ విద్యార్థులు, బీసీ యువత, బీసీ మహిళలు, బీసీ ఉద్యోగస్తులు వేలాదిగా తరలి రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment