నా పేరు అనపర్తి సన్యాసి, నా భార్య పేరు బాలక్క. మాది సర్వాయిపేట గ్రామం. పలిమెల మండలం. మేము ఇద్దరం కలిసి 1996లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరాం. ప్రభుత్వం, పోలీసుల సూచన మేరకు 2006లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ ఎస్పీ డీఎస్ చౌహాన్ ఎదుట లొంగిపోయాం. మాకు పునరావాసం కింద ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరగా తహసీల్దార్‌కు లేఖ రాశారు. అయినప్పటికీ తహసీల్దార్ ప్రభుత్వ భూమి లేదంటూ ఇప్పటి వరకు భూమి మంజూరు చేయడం లేదు. 19 ఏళ్లు వనవాసంలో ఉన్నాం. ఇప్పటికై నా ప్రభుత్వ భూమి కేటాయిస్తే ఇళ్లు కట్టుకుంటాం.