పక్క మండలానికి వెళ్లాల్సి వస్తోంది..
పలిమెల మండలం ఏర్పాటై తొమ్మిదేళ్లు అవుతుంది. ఇక్కడ గ్రామపంచాయతీల్లో ఈ–పాలన అందుబాటులోకి రాలేదు. గ్రామపంచాయతీ కార్యాలయానికి సంబంధించి ఏదైన ఆన్‌లైన్ పని ఉంటే మహదేవపూర్ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. సమయం, రవాణా ఖర్చులు వృథా అవుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామపంచాయతీల్లో ఈ–పాలన అందుబాటులోకి తీసుకురావాలి.
– జనగామ మధుకర్, పలిమెల
పంచాయతీల్లో ఈ–పాలనపై నివేదించాం
గతంలో గ్రామపంచాయతీల్లో ఈ–పాలన అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇంటర్నెట్ సౌకర్యం, సామగ్రి ఏర్పాటు చేశాం. ప్రక్రియ పూర్తికాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఇటీవల ఉన్నతాధికారులు గ్రామపంచాయతీల్లో కంప్యూటరీకరణపై నివేదిక కోరడంతో అందజేశాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment