
వేముల శంకర్‌కు డాక్టరేట్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ఐటీ మాస్టర్ డైరెక్టర్ వేముల శంకర్‌కు డాక్టరేట్ అవార్డు వరించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్(యూఎస్‌ఏ) గౌరవ డాక్టరేట్‌ను అందించింది. జిల్లాకేంద్రంలో 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 350–400 యూనిట్ల రక్తాన్ని ఎంజీఎం ఆస్పత్రికి అందిస్తూ వేలాది ప్రాణాలను రక్షిస్తున్నారు. అవయవదానం ఆవశ్యకతపై విద్యా సంస్థలలో అవగాహన కార్యక్రమాలు, ప్రచార యాత్రలు నిర్వహించారు. హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని ఐదు వేల మొక్కలను నాటించి 8,900మందికి ఉచిత కంప్యూటర్ శిక్షణ, నాలుగు వేల మందికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డును అందించనున్నారు.