ఉపాధ్యాయుడికి సాయం
కాళేశ్వరం: తమ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ.లక్షన్నర ఆర్థికసాయం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 2003–2009 వరకు శ్రీసరస్వతి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేసిన కాళేశ్వరం గ్రామానికి చెందిన మానెం శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని అప్పటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రూ.లక్షన్నర ఆర్థికసాయం కాళేశ్వరం వచ్చి ఆదివారం అందజేశారు. ఉపాధ్యాయులు అయ్యంగార్ తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, విద్యార్థులు శ్రీధర్, కళావతి, మల్లేశ్వరి, సంతోష్, విజయ్, నరేందర్, శ్రీకాంత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment