11శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి
భూపాలపల్లి రూరల్: ఎస్సీ వర్గీకరణలో మాదిగ ఉపకులాలకు 11 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ జిల్లా ఇన్‌చార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం డప్పుచప్పుళ్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో 11 శాతం రిజర్వేషన్లు ఆమోదింప చేయాలని, మాదిగ, మాదిగ ఉపకులాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. లేదనంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ జిల్లా, మండలాల నాయకులు దోర్నాల రాజేందర్ మాదిగ, అంతడుపుల సురేష్, దోర్నాల సారయ్య, నేర్పాటి అశోక్, మంద తిరుపతి, మడిపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.
దొంగనోట్ల కలకలం!
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో దొంగనోట్ల కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో మహిళా సంఘంలోని ఓ గ్రూపునకు చెందిన మహిళ నెలవారి కీస్తీలు డిపాజిట్ చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో నగదును క్యాషియర్ లెక్కిస్తుండగా అందులో ఓ 500 రూపాయల నోటు దొంగ నోటుగా గుర్తించారు. దీంతో సంఘ సభ్యులు ఎవరు ఇచ్చారనేది స్పష్టత రాకపోవడంతో మండలంలో దొంగ నోట్ల హవాసాగుతుందని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment