టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్, సీ సెంటర్ క స్టోడియన్‌లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని సూచించా రు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు జిల్లాలో 20 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని 3,449 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్‌రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
చిట్యాల: విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. భోజనం రుచిగా ఉంటుందా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో రాణించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment