కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పూసుకుపల్లి–మద్దులపల్లి అటవీప్రాంతంలో సోమవారం రా త్రి కార్చిచ్చు అంటుకొని మంటలు చెలరేగాయి. రహదారి పక్కన మంటలు వ్యాపించడంతో అడవి జీవరాశులు పరుగులు తీశాయి. అటవీ సంపద కా ర్చిచ్చుతో బూడిద అవుతున్నా అటవీశాఖ అధికారులు స్పందించలేదు. వేసవికాలం కావడంతో ఆకులన్నీ ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకొని కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తున్నా సంబంధిత అధికా రులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. మంటలు, పొగలతో రోడ్డుపైన వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అడవిలో చిన్న చిన్న మొక్కలు, చెట్లు కాలిపోయాయి. మొబైల్ ఫైర్ టీంలు సంచరించకపోవడంతో విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతుందని ఆరోపణలు ఉన్నాయి.