ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్‌కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్‌టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది.