ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

Published Wed, Mar 5 2025 1:26 AM | Last Updated on Wed, Mar 5 2025 1:21 AM

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

రేగొండ: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడెపాక గ్రామంలో ప్రతిష్ఠించిన రేణుకా ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల కొంగుబంగారంగా రేణుక ఎల్లమ్మ నిలిచిందన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గూటోజు కిష్టయ్య, నాయకులు పున్నం రవి, సూదనబోయిన ఓంప్రకాశ్‌, సురేందర్‌రెడ్డి, ఓమాజీ, మెండయ్య, తిరుపతి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement