ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
కుదురుపల్లి వద్ద లారీలు, ఆర్టీసీ బస్సులు
కాళేశ్వరం: ఇసుక లారీలు రోడ్డుపై రెండు వరుసల్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి టు మహదేవపూర్ మార్గమధ్యలో లారీలతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. కాటారం టు కాళేశ్వరం, కాళేశ్వరం టు వరంగల్ వైపు వెళ్లే వాహనాలు, ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారి 353 (సీ)పై లారీలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని రెండు గంటల పాటు ప్రయాణికులు తంటాలు పడ్డారు. కుదురుపల్లి నుంచి మహదేవపూర్ సమీపంలోని సర్సరీ వరకు లారీలు జామ్ కావడంతో ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంతో వారికివారే ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నారు. ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు లారీలు నిలిపేందుకు పార్కింగ్ స్థఽలాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపైనే యథేచ్ఛగా నిలిపివేస్తున్నారు. దీంతో నిత్యం ఇసుక లోడు, ఖాళీ లారీలు రోడ్డుకు రెండు వరుసలతో వెళుతుండడంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణికులు,
వాహనచోదకుల ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment