బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
మండలాల దళారులతో ములాఖత్
● వివిధ శాఖల
అధికారులతో సెటిల్‌మెంట్
● రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి
గోడౌన్‌కు తరలింపు
● అంతా ఆయన కనుసన్నల్లోనే
జరగాలని హుకుం
రీసైక్లింగ్ చేసి గోడౌన్‌కు తరలింపు..
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగిస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్(ఎస్‌డబ్ల్యూసీ) గోడౌన్‌లకు పంపించాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన పలువురు రైస్‌మిల్లర్లు గోల్‌మాల్ చేసి రైతుల ధాన్యానికి బదులుగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి హనుమకొండలోని గోడౌన్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కలర్ టెస్ట్‌లో పీడీఎస్ బియ్యాన్ని గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. దీంతో అక్కడి అధికారులకు డబ్బులు ఎరగా చూపి 290 క్వింటాళ్లకు (ఏసీకే) రూ.15వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఇప్పటివరకు వచ్చిన బియ్యం మొత్తాన్ని ఎంఎల్‌ఎస్ గోడౌన్ పాయింట్లకు పంపినట్లు సమాచారం.
జిల్లాకు చెందిన ఓ రైస్‌మిల్ యజమాని రెండు నెలలుగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేపిస్తూ డాన్‌గా ఎదిగాడు. పుష్ప సినిమాలో మాదిరిగా మండలాల వారీగా ఉన్న దళారులతో ములాఖత్ అయి అధికారులతో సెటిల్‌మెంట్లు చేసుకొని పేదల బియ్యాన్ని యథేచ్ఛగా రైస్‌మిల్లులకు సరఫరా చేయిస్తున్నాడు.
– భూపాలపల్లి
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment