అభివృద్ధి పనుల్లో వేగంపెంచాలి
మల్హర్: పీఎంశ్రీ పథకం ద్వారా మండలంలోని ఎడ్లపల్లి మోడల్ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్‌లో పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాల మొదటి అంతస్తులో నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్ల నిర్మాణం పనులు, ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆయన బుధవారం పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల మొదటి అంతస్తులో కిటికీ డోర్స్, గ్రిల్స్ తలుపులు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు.. కలెక్టర్‌ను కోరగా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపా ల్ పూర్ణచందర్ రావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్యాం సుందర్ పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల సహకారం అవసరం
భూపాలపల్లి: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, అబ్బాస్, ఇమా మ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా బోధన సాగిందని తెలిపారు. గత ఏడాది వార్షిక ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment