భక్తులకు మెరుగైన వైద్యసేవలు
రేగొండ: కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వైద్యం అందేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఈనెల 9నుంచి ప్రారంభమయ్యే కోటంచ జాతర సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అత్యవసర వైద్యం కోసం జాతరలో రెండు ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాస్కులు సరిపడా అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులు ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. జాతీయ సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి చికిత్స అందించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి హిమబిందు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment