ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
మల్హర్: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలకు పని ప్రదేశంలో అన్ని వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నరేష్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో చేపడతున్న ఉపాధిహామీ పనులను డీఆర్డీఓ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నరేష్ కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొలతల ప్రకారం పనిచేస్తే ఒక్క రోజుకు రూ.300 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని జీపీల్లోని పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ పందిరి, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ హరీశ్, టెక్నికల్ అసిస్టెంట్లు రమేష్, శైలజ, శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
యూరియా వాడకం
తగ్గించాలి
గణపురం: రైతులు వరి పంటలో యూరియా వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వీరునాయక్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం పంట నమోదు ప్రక్రియను పరిశీలించి రైతులు వేసిన వరిపంటపై యూరియా ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. యూరియా వాడకం తగ్గించాలని కోరారు. యూరియా అధికంగా వాడడం మూలంగా చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐలయ్య, పీఏసీఏస్ సీఈఓ భిక్షపతి, ఏఈఓలు పాల్గొన్నారు.
సౌకర్యాలను పరిశీలించిన ఆర్డీఓ
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న సౌకర్యాలను మంగళవారం ఆర్డీఓ రవి తహసీల్దార్ శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సింగరేణి హైస్కూల్, జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలో వంట గదులు, తరగతి గదులను తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని భారతీయ మజ్ధూర్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భారతీయ మజ్ధూర్ సంఘ్ జాతీయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేసి అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈపీఎఫ్ వేతన పరి మితిని రూ.15వేల నుంచి రూ.30వేలకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణ నిషేదం విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజేందర్, మల్లేష్, నర్సింగరావు, మల్లయ్య, రఘుపతిరెడ్డి, మల్లేష్, మొగిలి, భిక్షపతి, సురేష్ పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment