రామప్పను దర్శించిన కేరళీయులు
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయాన్ని కేరళకు చెందిన 27 మంది శనివారం సందర్శించారు. అంతర్రాష్ట్ర యువజన సమ్మేళన కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన యువకులు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్‌కుమార్ వివరించారు. గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును సందర్శించి వేలాడే వంతెన, ప్రకృతి అందాలను తిలకించినట్లు నెహ్రూ యువకేంద్రం సూపరింటెండెంట్ బానోత్ దేవీలాల్ తెలిపారు. కార్యక్రమంలో భాను, సురేశ్, భిక్షపతి పాల్గొన్నారు.
రామప్పను సందర్శించిన విదేశీయుడు..
రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన మార్క్ మెక్ లహ్ సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. నందీశ్వరుడి అందాలను సెల్‌ఫోన్‌లో బంధించుకున్నారు. రామప్పను సందర్శించిన పర్యాటకులు అమెరికన్‌తో ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు.
రామప్పను దర్శించిన కేరళీయులు
Comments
Please login to add a commentAdd a comment