
వైద్యశిబిరానికి విశేష స్పందన
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. మెడికవర్ హాస్పిటల్ నేతృత్వంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజపల్లి సుధాకర్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 500 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో అందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యమే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తాళ్ల పోశం, నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్, డాక్టర్లు షఫీ పాలగిరి, డాక్టర్ శ్రవణ్ కుమార్ జోగు, టుది ఎకో ప్రకాశ్, పీఆర్‌ఓ రాజు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment