
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
మొగుళ్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని వారికి అన్యాయం జరుగవద్దన్నారు. లబ్ధిదారుడికి లక్ష రూపాయలు జమ అయినట్లు ఆమె తెలిపారు. ఆమెవెంట హౌజింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి సుమత ఉన్నారు.
త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
చిట్యాల: మండలంలోని ముచినిపర్తి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లు, ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మిస్తున్న మోడల్ ఇంటి నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ ఎన్.విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని సూచించారు. బేస్‌మెంట్ వరకు పూర్తిచేసిన వారికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమఅవుతున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, ఏఈ రామలింగం, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.
కాళేశ్వరం దేవస్థానం
మాజీ చైర్మన్ మృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం మాజీ సర్పంచ్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గంట రామ్‌నారాయణగౌడ్ (70) అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనకు భార్య లత, కుమార్తె సుజాత ఉన్నారు.
భవన నిర్మాణానికి
కృషి చేస్తా..
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించే ది కాకతీయ లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లారీలు కొన్న ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావించుకొని అసోసియేషన్‌లో చేర్పించుకోవాలని అన్నారు. లారీ యాజమానులే ట్రాన్స్‌ఫోర్ట్ ఏర్పాటు చేసుకొని బొగ్గు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల చంద్రయ్య, గౌరవ అధ్యక్షుడు చెరుకుతోట శ్రీరాములు, ఉపాధ్యక్షుడు కౌటం సురేందర్, ప్రధాన కార్యదర్శి ఎండీ అన్వర్ పాషా, సహాయ కార్యదర్శి ఎనగంటి రమేష్, కోశాధికారి తాళ్లపల్లి తిరుపతిరావు, టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట రవి యాదవ్, లారీ ఓనర్లు పాల్గొన్నారు.
సమష్టిగా ఉంటేనే
సమస్యల పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: మైనింగ్ స్టాప్ అందరూ కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. ఏరియాలోని కేటీకే ఓసీ–3 లో ఏఐటీయూసీ ఏడీసీ ఆధ్వర్యంలో గురువారం కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉంటేనే అనేక సమస్యలు పరిష్కరించబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజేందర్, ఆసీఫ్ పాషా, శ్రీని వాస్, సుధాకర్ రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా కమిటీని గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కేతిరి సారయ్య, జిల్లా అధ్యక్షుడిగా కేతిరి రాజు, ప్రధాన కార్యదర్శిగా రెవెల్లి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేతిరి రవీందర్, ఉపాధ్యక్షులుగా పలువురు ఎన్నికయ్యారు.

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన