భూపాలపల్లి: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మామునూరు బెటాలియన్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలీసు అధికారులు ఈ ఏడాదికి సంబంధించిన ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సాధనలో ఎస్పీ కిరణ్ ఖరే, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పిస్టల్, ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్, వివిధ ఆటోమేటిక్ ఆయుధాలతో ఫైరింగ్ సాధన చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫైరింగ్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మంచి మెలకువలు నేర్చుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమైనవని, అత్యవసర సమయాల్లో ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణకోసం ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్‌రావు, నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.