నీటి పొదుపు బాధ్యత
కాటారం: నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారి రామకృష్ణ అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటి ఆవశ్యకతపై వెలుగు రేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి వినియోగం, నిర్వహణ, నీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ చర్యలు, భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం నీటిని భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవచ్చన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ డీపీఎం కిరణ్, డీబీఎస్ బ్యాంకు మేనేజర్ హరీశ్, సీఈఓ రజిత, రిసోర్స్‌పర్సన్ లక్ష్మిరాజం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment