కాటారం: కాటారం మండలం చల్లపల్లి సమీపంలోని రుద్ర జిన్నింగ్ మిల్లులో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తి జిన్నింగ్ ప్రక్రియలో భాగంగా మిషన్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మెరుగులు రాలి పక్కనే ఉన్న డస్ట్‌లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మిషన్‌లోని బెల్టులతో పాటు సమీపంలోని పత్తి బేల్స్, పత్తికి మంటలు అంటుకున్నాయి. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా.. అదుపులోకి రాలేదు. భూపాలపల్లి, మంథని నుంచి ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో వంద క్వింటాళ్ల పత్తి, మూడు పత్తి బేల్స్, యంత్రాలు దగ్ధమయ్యాయని, సుమారు రూ.15లక్షల మేర నష్టం వాటిల్లినట్లు నివ్వాహకులు పేర్కొన్నారు.
రూ.15లక్షల మేర నష్టం
Comments
Please login to add a commentAdd a comment