ఇసుక తరలింపు నిలిపివేత
ఏటూరునాగారం: మండల కేంద్రానికి సమీపాన గల సంఘంపాయ, గోదావరి శివారులో కొనసాగుతున్న ఇసుక క్వారీ ప్రారంభమైన నాలుగు రోజులకే నిలిచిపోయింది. క్వారీ నిర్వాహకులు ఇసుకను తరలించడానికి నెల రోజుల నుంచి రోడ్లను వేశారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తరలింపునకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రెవెన్యూ అటవీ మైనింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేబిల్లులలో ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువ ఇసుకను తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశాలలో పేర్కొంది. క్వారీ నుంచి వచ్చిన ఓవర్ లోడ్ లారీలను గమనించి సీజ్ చేయాలని లేదా ఎంత ఎక్కువ ఇసుక లారీలో ఉందో దానికి తగ్గ ఫైన్ ట్రెజరీకి చెల్లించే విధంగా విధానాన్ని రూపకల్పన చేసింది. నూతన విధానం అమలయ్యాక ఆయా క్వారీల నుంచి వస్తున్న లారీలను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ఓవర్ లోడ్ లారీలను నిలిపివేస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 1న ఏటూరునాగారం ఇసుక క్వారీ ప్రారంభమైంది. రెండు రోజులు క్వారీ ఆన్‌లైన్ డీడీలు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు రోజుల నుంచి క్వారీకి సంబంధించిన వేబిల్లుల నిర్వహణ ఆన్‌లైన్ నుంచి తొలగిపోయింది. అయితే ఈ మూడు రోజులుగా వారి యాజమాన్యం పాత వేబిల్లుల ప్రకారం కొనసాగించింది. రెండు రోజుల క్రితం ఏటూరునాగారం క్వారీ నుంచి వెళ్తున్న లారీలను రెవెన్యూ పోలీస్‌శాఖ అధికారులు గమనించి అధిక లోడ్‌తో వెళ్తున్నాయని ఒక లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకొని క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ ఇసుక తరలింపు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి క్వారీలో ఇసుక తరలింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇసుక క్వారీ ఫారెస్ట్ ఏరియా పరిధిలో
ఉందంటూ అటవీశాఖ ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment