జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాల అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసిసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్ 19 విభాగంలో కరీంనగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో నిర్వాహకులు ఈ జట్టును జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జట్టులో అత్యంత ప్రతిభ కనబర్చిన కాటా రం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి టి.జితేందర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మార్చి 26 నుండి 30వ తేదీ వరకు బీహార్‌లో జరిగే(హెచ్‌ఎఫ్‌ఐ) జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. జితేందర్‌ను ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్స్ మాధవి, వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, డిప్యూటీ వార్డెన్ నరేశ్, ఉపాధ్యాయులు అభినందించారు.
ఖోఖోకు ఎంపికై న ఆనంద్
టేకుమట్ల: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఫిజికల్ ఎడ్యూకేషన్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న చాగంటి ఆనంద్ జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖోకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడం ద్వారా నేటి(శుక్రవారం) నుంచి ఈ నెల 24 వరకు ఢిల్లీలో కొనసాగే జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖోలో తెలంగాణ జట్టులో ఆడనున్నట్లు తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక