25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్
భూపాలపల్లి: ఈ నెల 31వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో గురువారం మున్సిపల్, పట్టణ ప్రణాళిక, పంచాయతీ అధికారులతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అధికారులు, పంచాయతీల పరిధిలో పంచాయతీ అధికారులు సమన్వయంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ లోపు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు చెల్లించే మార్కెటింగ్ ఫీజు చెల్లిస్తే దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక అధికారి సునీల్, పంచాయతీ కార్యాలయ ఏఓ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని జూనియర్ కళాశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతంపై చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టంచేశారు. వైద్య సేవల కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
తనిఖీచేసిన డీఈసీ
కాళేశ్వరం: మహదేవపూర్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షాకేంద్రాన్ని డీఈసీ భూక్యా వెంకన్న తనిఖీ చేశారు. పరీక్షలకు జనరల్ విభాగంలో 108, ఒకేషనల్‌లో 34మందికి గాను ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని పరీక్షల అధికారి ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment