సాక్షి ప్రతినిధి, వరంగల్:
అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్‌కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్‌పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్‌లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది.
● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు
● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్‌పోర్టు,
‘సూపర్’ ప్రస్తావన లేదు
● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు..
దేవాదులకు రూ.245 కోట్లు
● స్మార్ట్‌సిటీకి రూ.179 కోట్లు,
కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు
● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు..
‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం
● ఎకో టూరిజం ప్రస్తావన..
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు
ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు ప