ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి
రేగొండ: ఉచిత న్యాయ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణ బాబు అన్నారు. బుధవారం ఆయన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జయరాంరెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిలతో కలిసి కోటంచ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో స్టాల్ ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు రూ.3లక్షల లోపు ఆదాయం కలిగిన వారు, బాలురు, బాలికలు, మహిళల అక్రమ రవాణా, భూకంపాలు, విపత్తులు సంభవించినప్పుడు ఏ విధమైన న్యాయ సహాయం కావాలన్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు సందీప్ కుమార్, షాఖాన్, ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ పారా లీగల్ వలంటీర్లు శ్రీనివాస్, రమేష్, తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయసేవాధికార సంస్థ చైర్మన్
నారాయణ బాబు