కుటుంబంలో అన్ని బంధాలు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నవి. ముఖ్యంగా అక్కా-తమ్ముడు, చెల్లి-అన్న బంధాలు.. కొన్ని సందర్భాల్లో ఎంతో భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే, తెలిసితెలియని వయసులో వీరి మధ్య చాడీలు చెప్పుకోవడం, ఒకరిపై ఒకరు పేరెంట్స్‌కు కంప్లాయింట్స్ చేసుకోవడం సరదాగా అనిపిస్తుంది. కానీ, ఒక ఏజ్ వచ్చాక.. సోదరికి బ్రదర్.. బహుమతి ఇచ్చిన సందర్భాల్లో వారు ఎంతో ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు అనేది చాలా మంది చూసే ఉంటారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అన్నా-చెల్లిని చూసిన నెటిజన్లు ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. వీడియోలో తన చెల్లికి అన్న.. ఆమె ఊహించని విధంగా బహుమతి ప్లాన్ చేశాడు. ఐశ్వర్య అనే యువతి తన సోదరుడు ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఈ క్రమంలో ఆ బాక్స్ లోపల ఏముందోనని చాలా ఆమె ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తెరుస్తుంది. తెరవడంతోనే దాని లోపల ఉన్నది చూసి ఆశ్చర్యపోతుంది.అందులో ఒక బైక్ కీ ఉండడం చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది.
కానీ.. ఇంతలోనే తన అన్న గిఫ్ట్‌గా ఇచ్చిన స్కూటీని చూసి ఆమె సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంది. అతనిని కౌగిలించుకుంది. ఈ క్షణంలో వారి ఇద్దరూ ఎమోషనల్‌గా ఫీల్ అవడం వారి కుటుంబ సభ్యులు చూసి భావోద్వేగానికి గురవుతారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే మాత్రం తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment