Emotional attachment
-
PM Narendra Modi: పదేళ్ల మన్‌కీ బాత్
న్యూఢిల్లీ: ‘‘మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారన్న వాదనలో నిజం లేదని మన్‌కీ బాత్ నిరూపించింది. సానుకూల కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలకు అమితమైన ఆదరణ ఉంటుందని ఈ కార్యక్రమంతో తేటతెల్లమైంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం 114వ మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడారు. దేశ ప్రజల సామూహిక శక్తిని ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం మారిందంటూ ప్రశంసించారు. దీనికి పదేళ్లు పూర్తయిన సందర్భం తనను భావోద్వేగానికి గురి చేస్తోందన్నారు. ‘‘సరిగ్గా పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభమైంది. భారత స్ఫూర్తిని వేడుక చేసుకొనే విశిష్టమైన వేదికగా మారింది. దీనితో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రయాణంలో శ్రోతలు నాతోపాటు కలిసి నడిచారు. దేశ నలుమూలల నుంచి నాకు సమాచారం చేరవేశారు. మన్‌కీ బాత్ అంటే నా వరకు దైవదర్శనానికి ఆలయానికి వెళ్లడం లాంటిదే. దీనితో అనుసంధానమైన ప్రతి అంశం ద్వారా సామాన్య ప్రజలను దర్శించుకున్నట్లే భావిస్తా. ప్రజలే నాకు దేవుళ్లు. 22 భారతీయ, 12 విదేశీ భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ మలుపులో మరోసారి ప్రజల ఆశీస్సులు కోరుతున్నా’’ అన్నారు.పుణే మెట్రో తొలి దశ ప్రారంభం పుణే: ‘‘గత ప్రభుత్వాలు పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో ఒక ప్రణాళిక, దార్శనికత లోపించాయి. మేమొచ్చాక వచ్చాక పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పాత పని సంస్కృతికి చరమగీతం పాడాం’’ అని మోదీ చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలో పుణే మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే స్మారక బాలిక పాఠశాల’ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. గత ప్రభుత్వాల విధానాలు అమల్లో ఉంటే పుణే మెట్రో ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయి ఉండేది కాదన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చొరవతో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగుతున్నాయని చెప్పారు. వాటికీ పదేళ్లు ప్రతిష్టాత్మకంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కూడా పదేళ్లు పూర్తి చేసుకుందని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కూ అక్టోబర్ 2న పదేళ్లు పూర్తవుతాయన్నారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ విజయవంతమవుతోంది. జీవితాంతం పరిశుభ్రత కోసం తపించిన మహాత్మా గాం«దీకి ఇదో గొప్ప నివాళి. ఇక పారిశ్రామికవేత్తలతో పాటు చిరు వ్యాపారుల కృషితో ‘మేకిన్ ఇండియా’ విజయవంతమైంది. మన యువశక్తి కృషితో తయారీ రంగానికి భారత్ కేంద్రస్థానంగా మారింది. అటోమొబైల్స్ మొదలుకుని రక్షణ దాకా అన్ని రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి.స్థానికతకు జై స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని పెంచి ప్రోత్సహిస్తే అంతిమంగా దేశానికే లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. ‘‘మన గడ్డపై మన కళాకారులు, కారి్మకుల రెక్కల కష్టంతో తయారైన ఉత్పత్తులే మనకు గర్వకారణం. పండుగల వేళ స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయండి’’ అని పిలుపునిచ్చారు. జల సంరక్షణలో నూతన విధానాలు చక్కటి ఫలితాలిస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘కొన్నిచోట్ల మహిళా శక్తి జలశక్తిని పెంచుతోంది. మరికొన్నిచోట్ల జలశక్తి మహిళా శక్తికి తోడ్పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పురా గ్రామంలో భారీ నీటి కుంట నిర్మించి భూగర్భ జలాలను పెంచారు. డ్వాక్రా మహిళలు అందులో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు’’ అని చెప్పారు. -
‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ‘జగన్‌బాబు దేవుడయ్యా... ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెలా ఒకటో తేదీకల్లా జీతం ఇచ్చినట్లు వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపి మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు. పిల్లల ఆదరణలేని అనేకమంది వృద్ధ దంపతులను సొంత కొడుకులా ఆదుకుంటున్నాడు. జబ్బు చేసినా పెద్ద వైద్యం చేయించి ఆదరణ లేని మాలాంటి ముసలోళ్లను కాపాడుతున్నాడు..’ అంటూ కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన వృద్ధుడు మోపిదేవి లీలాజలం కన్నీరు పెట్టుకున్నాడు. పెదపట్నంలో మంగళవారం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘జగనన్నే మా భవిష్యత్’లో భాగంగా గ్రామ సర్పంచ్ గడిదేసి అనూష, వైఎసాస్ర్సీపీ నాయకుడు గడిదేసి రాజు తదితరులు పెదపట్నంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు ఈ క్రమంలో 85 ఏళ్ల వయసు కలిగిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుని ఇంటి వద్దకు వెళ్లగా... ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత తమకు కలిగిన మేలును వివరిస్తూ ఆనందంతో కన్నీరుపెట్టారు. -
వదిలి వెళ్లొద్దంటూ యజమానిపై ఏనుగు ప్రేమ
-
చెల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన అన్న.. బహుమతి చూసి ఆమె..
కుటుంబంలో అన్ని బంధాలు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నవి. ముఖ్యంగా అక్కా-తమ్ముడు, చెల్లి-అన్న బంధాలు.. కొన్ని సందర్భాల్లో ఎంతో భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే, తెలిసితెలియని వయసులో వీరి మధ్య చాడీలు చెప్పుకోవడం, ఒకరిపై ఒకరు పేరెంట్స్‌కు కంప్లాయింట్స్ చేసుకోవడం సరదాగా అనిపిస్తుంది. కానీ, ఒక ఏజ్ వచ్చాక.. సోదరికి బ్రదర్.. బహుమతి ఇచ్చిన సందర్భాల్లో వారు ఎంతో ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు అనేది చాలా మంది చూసే ఉంటారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అన్నా-చెల్లిని చూసిన నెటిజన్లు ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. వీడియోలో తన చెల్లికి అన్న.. ఆమె ఊహించని విధంగా బహుమతి ప్లాన్ చేశాడు. ఐశ్వర్య అనే యువతి తన సోదరుడు ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఈ క్రమంలో ఆ బాక్స్ లోపల ఏముందోనని చాలా ఆమె ఎంతో ఇంట్రెస్టింగ్గా తెరుస్తుంది. తెరవడంతోనే దాని లోపల ఉన్నది చూసి ఆశ్చర్యపోతుంది.అందులో ఒక బైక్ కీ ఉండడం చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. కానీ.. ఇంతలోనే తన అన్న గిఫ్ట్‌గా ఇచ్చిన స్కూటీని చూసి ఆమె సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంది. అతనిని కౌగిలించుకుంది. ఈ క్షణంలో వారి ఇద్దరూ ఎమోషనల్‌గా ఫీల్ అవడం వారి కుటుంబ సభ్యులు చూసి భావోద్వేగానికి గురవుతారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే మాత్రం తెలియరాలేదు. View this post on Instagram A post shared by ऐश्वर्या भदाणे (@aishwarya_bhadane) -
Venkaiah Naidu: వెంకయ్య భావోద్వేగం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ‘‘రాజకీయాల నుండి రిటైర్ అయ్యానని, కానీ ప్రజా జీవితంలో అలసిపోలేదని మీరు తరచుగా చెబుతుంటారు. మీ పదవీ కాలం ముగియవచ్చు గానీ మీ జీవితం, మీ అనుభవాలు రాబోయే కాలంలో దేశానికి మార్గదర్శకంగా ఉంటాయి’’ అని వెంకయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య పదవీ కాలం 10న ముగియనుంది. ఇదిలా ఉంటే, వెంకయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, ఏడాది వయసులో తల్లిని కోల్పోయారని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నిమిషం పాటు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఒత్తిడిలోనూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని వెంకయ్యను ప్రశంసించారు. సభ గౌరవాన్ని వెంకయ్య పెంచారని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు. ఆత్మకథ రాయండి వెంకయ్య నాయుడి రాజకీయ జీవితం, అందించిన సేవలు అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆత్మకథ(ఆటోబయోగ్రఫీ) రాయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూశారని, వివక్ష ప్రదర్శించలేదని పలువురు ఎంపీలు కొనియాడారు. చదవండి: (పాలిటిక్స్‌లో పిడుగుపాటు.. బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ తెగదెంపులు!) -
6 లక్షల జీతం.. ప్రేమించి పెళ్లాడి.. ఆఖరికి విడాకులు? అసలు తెలివి అంటే?
ఆమె ఐఐఎంలో ఎంబీఏ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో నెలకు ఆరు లక్షల జీతం పొందే ఉన్నతోద్యాగాన్ని సాధించింది. ఉద్యోగం వచ్చాక ఒక అబ్బాయిని రెండేళ్లపాటు ప్రేమించింది. తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకుంది. పెళ్ళయాక ఆరునెలల్లో విడాకులు తీసుకొంది. అప్పటికి తాను నాలుగు నెలల గర్భవతి. అబార్షన్ చేయించుకొని విడాకులు తీసుకొన్న ఆమె ఇప్పుడు డిప్రెషన్లో ఉంది. ఇక జీవితంలో పెళ్లిచేసుకోను అంటోంది . మరో చోట మరో అమ్మాయి. అమెరికాలో అత్యున్నత సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అటుపై పెద్ద ఉద్యోగం సాధించింది. ఈమె సంపాదనపై కన్నేసిన ఒక యువకుడి ప్రేమ వలలో చిక్కి నరకయాతన అనుభవించి ఎలాగో ఒకలా బయటపడింది . మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు చేస్తూ దానికి ఆదరణ లేదని (మరి కొన్ని కారణాలు) ఆత్మహత్య చేసుకొన్నాడు. పెద్దగా చదువుకోని వారు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి.. నువ్వు చదివే చదివేంటి ? చేస్తున్న వీడియోలు ఏంటి ? అంతకు మించి వీడియోలకు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియకపోవడం.. పోనీ రాలేదు. అదే జీవితం అనుకొని తనువు చలించడం. ఏంటిది ? లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే ! కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం.. ఒకసారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం. అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని.. తనకు కంపెనీ ఇచ్చిన షేర్లను అని తెలుసుకోలేని అమాయకత్వం.. ఏంటివన్నీ? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ లాంటి సబ్జెక్టులలో నైపుణ్యం సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు. సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్.. భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్. శ్రీదేవి. ఒకనాటి యువకుల కలల రాణి. అద్భుత నటి. కానీ అదివరకే పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొంది. అనూహ్య పరిస్థితుల్లో లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఇక మరో ప్రముఖ నటి సావిత్రి ఎలా మోసపోయిందో మహానటి సినిమా పుణ్యమా అని చాలామందికి తెలిసింది. తెలివైన వారు ప్రతిభావంతులు ఇలా మోసపోతారెందుకు? చాలా మందికి అర్థం కాని విషయం ఒకటుంది. తెలివంటే కేవలం పాఠ్యఅంశాలపై పట్టుసాధించి మార్కులు, ర్యాంకులు కొట్టడం కాదు . మీకందరకు ఒక కాలేజీ మిత్రుడుంటాడు. కాలేజి ఎగ్గొట్టి జులాయిలా బలాదూర్ తిరిగేవాడు. కాలేజీలో పుస్తకాలతో కుస్తీ పట్టే వారెందరో ఇప్పుడు సర్కారీ క్లర్కులుగా ఉంటే.. మీరనుకున్న ఆ జులాయి కాంట్రాక్టర్‌గానో, బిజినెస్మేన్గానో అవతరమెత్తి కోట్లు కూడబెట్టివుంటాడు. కేవలం లక్ లేదా పలుకుబడి అనుకొంటే అది మీ అమాయకత్వం అవుతుంది. ఆలోచించండి. ఇదెలా సాధ్యం ? సోషల్ ఇంటలిజెన్స్.. సామాజిక తేలితేటలు.. ఎమోషనల్ ఇంటలిజెన్స్.. భావోద్వేగ తెలివితేటలు. ఈ రెండూ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత సంపద ఉన్నాఅన్ని బండి సున్నాయే. ఎలాగంటారా ? మార్కులు, జీతం, సంపద ఇవన్నీ లక్షల్లో. సామజిక తేలితేటలు జీరో. ఇప్పుడు ఈ జీరోతో ఆస్తిని సంపాదనను గుణించండి. ఏమొచ్చింది? బండి సున్నా. అవునా కదా ? సామాజిక తెలివితేటలు ఉంటే ఆ సంఖ్యను ఆస్తి / జీతంతో గుణించండి. అనేక రెట్లు పెరుగుతుంది. సామాజిక తేలితేటలు లేక మలిమొఘల్ చక్రవర్తులైన ఫారూఖ్ షియార్, రఫీ ఉద్ డారాజ్, రఫీ ఉద్దీన్ లాంటి వారు సయ్యిద్ సోదరుల చేతిలో చిక్కి విలవిలలాడి, చరిత్ర మరుగయ్యారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ లేక పెద్ద సినిమాల్లో హీరోగా నటించినా అటుపై అవకాశాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకొన్న వారొకరు. డిప్రెషన్ లో మరొకరు. దీర్ఘకాలం కోమా.. ఉరి.. ఇలా మరణాన్ని పొందినవారు ఇంకొందరు. తాత సంపాదించిన ఆస్తిని తగలెట్టేసి వ్యాపారాన్ని దివాళా తీయించిన వారు ఎందరో ! ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఈ వ్యక్తులు ఎవరు అని కాదు. ఎమోషనల్ సోషల్ ఇంటలిజెన్స్‌ను పిలల్లకు ఎలా నేర్పాలి? ఇందులో స్కూల్ , కాలేజీ పాత్ర ఏంటి ? తల్లితండ్రులుగా మన పాత్ర ఏంటి అని? ఆయన నాలుగో పెళ్ళానికి మూడో భర్త ఎవరు? ఆ వీడియోలో ఆమె ఒయ్యారాన్ని ఒలక పోసిందా? ఇలాంటి మనకు అవసరం లేని విషయాలపై మీరు ఆసక్తి ప్రదర్శిస్తూ సమయాన్ని వినియోగిస్తుంటే.. మీ పిలల్లు ఇంటర్నెట్ చీకటి ప్రపంచంలో దొరికే వీడియోలకు బానిసలై మీ చేయి దాటి పోతారు. ఆవు/ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పిల్లలకు సోషల్ ఇంటలిజెన్స్ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఎలా నేర్పాలో ఆలోచిస్తూ ఉండండి. - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
ఇప్పుడు నా ఎడమ భుజం పోయింది: కే. విశ్వనాథ్
Director K Viswanath Emotional About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక సీతారామా శాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన వ్యక్తి దర్శకుడు కే. విశ్వనాథ్. వారిద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఉండేది. సిరివెన్నెలను తమ్ముడిగా భావిస్తారు విశ్వనాథ్. అలాంటిది సీతారామాశాస్త్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయారు విశ్వనాథ్. సిరివెన్నెల మృతి తనకు తీరని లోటన్నారు. (చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ విశ్వనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ -
నా సర్వీసు సంతృప్తికరం
సాక్షి, నల్లగొండ: ‘‘ఉద్యోగరీత్యా పెంచికల్‌దిన్నె, సూర్యాపేట, హుజూర్‌నగర్‌లో పనిచేసేటప్పుడు పిల్లలతో గడపడానికి సమయం సరిపోయేది కాదు. పిల్లల చదువులు, ఇతర విషయాలను నా సహచరిణి సరోజనే చూసుకునేది. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా మా నాన్న వై.శ్రీరాంమూర్తి, భార్య సరోజతో కలిసి చర్చించి పరిష్కారం చేసుకుంటుంటాం. సరోజ సహకారంతోనే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలిగాను.’’ అని అంటున్నారు జిల్లా అధికారిగా తన సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వై.గంగావరప్రసాద్. శనివారం ఆయన తన కుటుంబ విషయాలను ‘సాక్షి పర్సనల్ టైమ్’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..మాది మిర్యాలగూడ పట్టణం. నాన్న వై.శ్రీరాంమూర్తి రిటైర్డ్ ఎస్ఈ. అమ్మ వైడీ కల్యాణి గృహిణిగా ఉండేది. వారికి నేను ఏకైక సంతానాన్ని. నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తుండడంతో నా విద్యాభ్యాసం మొత్తం నాలుగు జిల్లాలతో ముడిపడింది. ఆయనకు ఎక్కడ బదిలీ అయితే అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. ఎల్కేజీ నుంచి సెకండ్ క్లాస్ వరకు నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో, మూడవ తరగతి నుంచి 5వ తరగతి వరకు కృష్ణా జిల్లాలో, 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాలలో సాగింది. తిరిగి ఇంటర్మీడియట్ మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశాను. ఎంబీబీఎస్ హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలలో, డీఎల్ఓ కాకతీయ మెడికల్ కళాశాలలో పూర్తి చేశాను. 1998లో నేరేడుచర్ల మండలంలో పెంచికల్ దిన్నె ప్రభుత్వ డిస్పెన్సరీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించాను. అనంతరం మిర్యాలగూడ పీపీ యూనిట్లో, వేములపల్లి మెడికల్ ఆఫీసర్‌గా, అనంతరం హుజూర్నగర్ వైద్యశాలకు ఈఎన్టీ స్పెషలిస్టుగా పదోన్నతిపై వెళ్లాను. అనంతరం నడిగూడెం ఎస్పీహెచ్ఓగా, సూర్యాపేట పీఓడీటీటీగా తదనంతరం 2018లో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా చేరాను. గత జనవరిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా(ఎఫ్ఏసీ) బాధ్యతలను స్వీకరించి ఎలాంటి ఒడిదుడకులూ లేకుండా జిల్లాఅధికారులు, సిబ్బంది సహకారంతో సర్వీసును పూర్తి చేసుకోవడం సంతృప్తినిచ్చింది. 1987జూన్‌లో వివాహం విజయవాడకు చెందిన సరోజతో 1987లో వివాహం జరిగింది. మాకు ఇద్దకు సంతానం. కుమారుడు డాక్టర్ వై.కళ్యాణ్‌రాం ఎండీఎస్, కోడలు డాక్టర్ అక్షిత బీడీఎస్ ఇద్దరు కలిసి మిర్యాలగూడలో కళ్యాణ్ డెంటల్ క్లీనిక్‌ను నిర్వహిస్తున్నారు. వారికి ఒక సంవత్సరం వయస్సు కలిగిన తన్విక అనే అమ్మాయి ఉంది. మా అమ్మాయి వై.లిఖిత బీటెక్‌ను పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. అమ్మాయికి వివాహం చేయాల్సి ఉంది. భార్య సరోజ సహకారంతోనే.. నేను ఉద్యోగరీత్యా ఇతర పట్టణాలలో పనిచేయాల్సి వచ్చిన సమయంలో కుటుంబాన్ని మొత్తం సరోజనే చూసుకునేది. పిల్లల చదువులు, పోషణ, నా తండ్రి ఆలనాపాలనా మొత్తం ఆవిడే చూసుకోవడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కావు. ఇప్పటికీ నేను డ్యూటీకి వెళ్లేటప్పుడు టిఫిన్ బాక్స్ పెట్టి బ్యాగులో పెడుతుంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేయడం వల్ల కొన్నిసార్లు ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యేది. అయినా ఇంటి సమస్యలను ఎంతో ఓపికతో నేను వచ్చాక నాతో చర్చించేది. నాకు ఆమె అందించిన సహకారంతో కుటుం బం తో పాటు సర్వీసులోనూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పనిచేశాననని కచ్చితంగా చెబుతా. అమ్మ చనిపోవడం బాధించింది నేను ఎంబీబీఎస్ మూడవ సంవత్సరంలో ఉండగానే అమ్మ కళ్యాణి చనిపోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. నేను ఏకైక సంతానం కాబట్టి నాన్న బాగోగులు చూసుకోవడం కోసం మిర్యాలగూడలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఉద్యోగ రీత్యా వివిధ రకాల అవకాశాలు వచ్చినప్పటికీ నాన్నకోసం అన్నింటినీ వదులుకుని ఉండాల్సి వచ్చింది. అమ్మ ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇప్పటికీ అమ్మలేదనే బాధ నన్ను బాధిస్తుంది. నా సర్వీసులో పై అధికారులతోపాటు సిబ్బంది అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరువలేను. వేలాది మందికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశాను. బెస్ట్ సర్జన్‌గా అప్పటి కలెక్టర్ పురుషోత్తంరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా జిల్లా ప్రజలకు సేవలందించడం మంచి సంతృప్తిని ఇచ్చింది. రిటైర్డ్ కాగానే ఈఎన్టీ సర్జన్‌గా ప్రాక్టీస్ ఉద్యోగ విరమణ పొందిన తరువాత కూడా ప్రజలకు సేవలందించాలనే తలంపుతో మిర్యాలగూడలో ఈఎన్టీ సర్జన్‌గా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించాలని నిర్ణయించుకున్నాను. నిత్యం ప్రజల మధ్యలో ఉండి వైద్యసేవలందించడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. -
ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఉంటే చాలు
లండన్: సాధారణంగా ఉద్యోగ బాధ్యతలు అంటే కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రైవేటు కొలువైతే ఇక ఆ ఇబ్బంది చెప్పలేనంతగా పీలవుతారు. అసలు అలాంటి ఇబ్బందే కలగకుండా, ఆ ఫీలింగే రాకుండా ఉంటూ చక్కగా ఆరోగ్యంగా బతికేయొచ్చంటున్నారు కొందరు అధ్యయనకారులు. అది ఎలాగని అనుకుంటున్నారా.. మరేం లేదు మనం ఏపని చేస్తున్నామో దానికి మన ఎమోషన్ ను ఎటాచ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ పనిని బాగా ప్రేమించాలన్నమాట. అలా చేయడం ద్వారా సంతోషం, చక్కటి ఆరోగ్యంతో పాటు సదరు సంస్థ నిర్దేశిత లక్ష్యాలను కూడా తేలికగా అధిగమించవచ్చని కొపెన్ హాగన్ లోని నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ వర్కింగ్ ఎన్విరాన్ మెంట్ సెంటర్ తెలిపింది. ఇందుకోసం వారు ఆరు వేలమందిని కొన్ని గ్రూపులగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు.