భావోద్వేగానికి గురైన వృద్ధుడు మోపిదేవి లీలాజలం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ‘జగన్‌బాబు దేవుడయ్యా... ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెలా ఒకటో తేదీకల్లా జీతం ఇచ్చినట్లు వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపి మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు. పిల్లల ఆదరణలేని అనేకమంది వృద్ధ దంపతులను సొంత కొడుకులా ఆదుకుంటున్నాడు.
జబ్బు చేసినా పెద్ద వైద్యం చేయించి ఆదరణ లేని మాలాంటి ముసలోళ్లను కాపాడుతున్నాడు..’ అంటూ కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన వృద్ధుడు మోపిదేవి లీలాజలం కన్నీరు పెట్టుకున్నాడు. పెదపట్నంలో మంగళవారం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
‘జగనన్నే మా భవిష్యత్’లో భాగంగా గ్రామ సర్పంచ్ గడిదేసి అనూష, వైఎసాస్‌ర్‌సీపీ నాయకుడు గడిదేసి రాజు తదితరులు పెదపట్నంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
చదవండి: ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు
ఈ క్రమంలో 85 ఏళ్ల వయసు కలిగిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుని ఇంటి వద్దకు వెళ్లగా... ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత తమకు కలిగిన మేలును వివరిస్తూ ఆనందంతో కన్నీరుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment