machilipatam
-
ఏపీ యువతి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ : ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య (Singavarapu Esther Anuhya) హత్యకేసులో సుప్రీం కోర్టు (supreme court) సంచలన తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో నిందితుణ్ని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మచిలీపట్నానికి చెందిన అనూహ్య జనవరి 4,2014న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన 2014,జనవరి 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించింది. ఎస్తేర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం తర్వాత.. హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఎస్తేర్ హత్యకేసులో ముంబైకి చెందిన చంద్రభానుకు 2015లో ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేసింది.కేసు విచారణలో భాగంగా 2018లో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సైతం సమర్ధించింది. అయితే హైకోర్టును తీర్పును సవాలు చేస్తూ చంద్రభాను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తాజాగా, మంగళవారం ఈ కేసును జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా చంద్రభానే ఈ హత్య చేశాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని అత్యున్నత న్యాయ స్థానం వ్యాఖ్యానించింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న కేసు విచారణలో కీలక తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో చంద్రభాను నిర్ధోషి’ అని తేల్చేసింది.👉చదవండి : గురుమూర్తి మనిషి కాదు.. మనిషి రూపంలో ఉన్న నర రూప రాక్షసుడు -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసు.. పేర్ని నాని సతీమణికి ఊరట
సాక్షి,కృష్ణా : కూటమి ప్రభుత్వం నమోదు చేసిన రేషన్ బియ్యం అక్రమ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఊరట దక్కింది. పేర్ని నానీ సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఇప్పటికే ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన.అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు.నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.... సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
భార్యా భర్తల గొడవలో దూరి పచ్చ బ్యాచ్ దౌర్జన్యం
-
అప్పుడే పుట్టిన పసికందు కిడ్నాప్.. నర్సు వేషంలో వచ్చి..
సాక్షి,కృష్ణాజిల్లా : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు కిడ్నాప్‌కు గురైంది. నర్స్ వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు, ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో నాలుగు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.కిడ్నాప్ చేసిన మహిళ మచిలీ పట్నానికి చెందిన చెరుకురసం అమ్మే మహిళగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే మహిళ అప్పుడే పుట్టిన చిన్నారిని కిడ్నాప్ చేయడానికి గల కారణాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పోలింగ్ సరళి పరిశీలించాక ఓటమి ఖరారు చేసుకున్న కొల్లు రవీంద్ర
-
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్ధేశమని తెలిపారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ.. సంస్కరణ తీసుకురావాలనేది మీ బిడ్డ ఆలోచన అని సీఎం జగన్ తెలిపారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ యాక్ట్ గొప్పదని టీడీపీ నేత పయ్యావులే అసెంబ్లీలో చెప్పాడని ప్రస్తావించారు. మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. బాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ గోయింగ్ స్కీమ్స్‌ను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని నిప్పులు చెరిగారు.సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధిపొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమేచంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.పేదల శత్రువులంతా ఒక్కటయ్యారుచంద్రబాబువి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే14 ఏళ్లో చంద్రబాబు ఒక్క మంచిపనైననా చేశాడా?చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు2 లక్షల కోట్ల డ్రగ్స్ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడుఆ డ్రగ్స్ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని తేలింది.తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం130 సార్లు బటన్ నొక్కి వివిధ పథకాల ద్వారా మంచి చేశాంపేదలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం2 లక్షల 31 వేలకుపైగా ఉద్యోగాలిచ్చాంనాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాంప్రభుత్వ బడుల్లో 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులుప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధనవిద్యార్థులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, బైజూస్ కంటెంట్‌బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్దఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెనవిద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూతఅక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తంఅక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలుపెట్టుబడి సాయంతో రైతులకు అండగా నిలబడ్డాంరైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాంసకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాంవిత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాంజగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు ఆర్ధిక సాయంమత్స్యకార భరోసా, లా నేస్తం, వాహనమిత్ర ద్వారా ఆదుకున్నాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి కార్యక్రమాలూ చూశారామచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్ హార్బర్‌మచిలీపట్నం అభివృద్ధికి బాటలు వేసింది మీ బిడ్డ జగనే.రూ.5100 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతుందిమచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్ హార్బర్‌గతంలో ఇంత మంచి ఎప్పుడైనా మీరు చూశారా? -
నేడు 24వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర
-
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్‌కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
బాలికపై టీడీపీ నేత ఆవుల సతీష్, జనసేన నేత కల్యాణ్ లైంగిక దాడి
-
మైనర్ బాలికపై టిడిపి మరియు జనసేన నేతల లైంగిక దాడి
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. మచిలీపట్నంలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్‌కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే రెండు మేకలను బలి ఇచ్చి వీరంగం సృష్టించారు. అంతే కాకుండా వాటి రక్తాన్ని ఎన్టీఆర్ బ్యానర్లపై చిందించారు. (ఇది చదవండి: షాకింగ్.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్) ఈ క్రమంలో వారు పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకురావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాబర్ట్‌సన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రి రీ-రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయావాడలో థియేటర్లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో జతకట్టనున్నారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) -
పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి
-
బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ‘జగన్‌బాబు దేవుడయ్యా... ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెలా ఒకటో తేదీకల్లా జీతం ఇచ్చినట్లు వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపి మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు. పిల్లల ఆదరణలేని అనేకమంది వృద్ధ దంపతులను సొంత కొడుకులా ఆదుకుంటున్నాడు. జబ్బు చేసినా పెద్ద వైద్యం చేయించి ఆదరణ లేని మాలాంటి ముసలోళ్లను కాపాడుతున్నాడు..’ అంటూ కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన వృద్ధుడు మోపిదేవి లీలాజలం కన్నీరు పెట్టుకున్నాడు. పెదపట్నంలో మంగళవారం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘జగనన్నే మా భవిష్యత్’లో భాగంగా గ్రామ సర్పంచ్ గడిదేసి అనూష, వైఎసాస్ర్సీపీ నాయకుడు గడిదేసి రాజు తదితరులు పెదపట్నంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు ఈ క్రమంలో 85 ఏళ్ల వయసు కలిగిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుని ఇంటి వద్దకు వెళ్లగా... ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత తమకు కలిగిన మేలును వివరిస్తూ ఆనందంతో కన్నీరుపెట్టారు. -
ప్రభుత్వం ఆధ్వర్యంలొనే పోర్టు నిర్మాణానికి టెండర్లు
-
దివ్యాంగులతో మూగ భాషలో సంభాషించిన మంత్రి పేర్నినాని
-
మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగింది. బడుగు నాగేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త పదునైన సన్నపాటి తాపీ (భవన నిర్మాణాల సందర్భంగా మేస్త్రీలు ఉపయోగించే పనిముట్టు)తో మంత్రిని రెండుసార్లు పొడవగా.. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. సరిగ్గా ఐదు నెలల క్రితం (జూన్ 29) మంత్రి నానికి ప్రధాన అనుచరుడైన మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావును టీడీపీకి చెందిన వ్యక్తులు కొబ్బరి కాయల్ని ఒలిచే పొడవాటి ఇనుప ఊచలాంటి ఆయుధంతో పట్టపగలే పొడిచి చంపారు. అదే తరహాలో మంత్రి నానిని కూడా మట్టుబెట్టేందుకు యత్నించడం కలకలం రేపింది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మంత్రి పేర్ని నాని తల్లి, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి సతీమణి నాగేశ్వరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె పెద్దకర్మ ఆదివారం మచిలీపట్నం మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి నాని రామానాయుడు పేటలోని ఇంటివద్ద పూజా కార్యక్రమాలు ముగించుకుని ఉదయం 11.10 గంటల సమయంలో మార్కెట్ యార్డుకు బయలుదేరేందుకు బయటకు వచ్చారు. మంత్రి మెట్లు దిగుతుండగా.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలసి అక్కడ వేచివున్న టీడీపీ కార్యకర్త బడుగు నాగేశ్వరరావు మంత్రి కాళ్లకు నమస్కారం పెట్టేందుకు అన్నట్టుగా కిందకు వంగి.. వెంట తెచ్చుకున్న పదునైన తాపీతో మంత్రి పొత్తి కడుపులో బలంగా పొడిచాడు. ఆ సమయంలో మంత్రి కాస్త వెనక్కి జరగటం, తాపీ ఆయన ప్యాంట్‌పై ధరించిన లెదర్ బెల్ట్ బకెల్‌కు బలంగా తగలటంతో వంగిపోయింది. వెంటనే నిందితుడు నాగేశ్వరరావు మంత్రి చొక్కా కాలర్ పట్టుకుని మరోసారి పొడిచేందుకు యత్నించాడు. రెండోసారి కడుపులో బలంగా పొడిచినప్పటికీ అప్పటికే తాపీ వంగిపోవడంతో మంత్రికి ఎలాంటి గాయం కాలేదు. ఆ సమయంలో బటన్స్ ఊడిపోయి మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. వెంటనే తేరుకున్న మంత్రి నిందితుణ్ణి వెనక్కి తోసేశారు. అయినా నిందితుడు పట్టు వదలకుండా మరోసారి దాడి చేసేందుకు యత్నించగా.. మంత్రి కిందపడిపోయారు. అక్కడే ఉన్న అంగన్వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి, పార్టీ నాయకుడు పరింకాయల విజయ్ మంత్రిని లేవదీయగా.. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు నిందితుణ్ణి అదుపులోకిì తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ వెంటనే మంత్రి నాని చొక్కా మార్చుకుని ఆటోలో బయల్దేరి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మార్కెట్ యార్డుకు వెళ్లి మంత్రి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు ‘కొల్లు’ అనుచరుడే మంత్రిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన బడుగు నాగేశ్వరరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడైన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు ప్రధాన అనుచరుడు. తెలుగు మహిళ విభాగం నగర శాఖ అధ్యక్షురాలు బడుగు ఉమాదేవి సోదరుడు. గడచిన ఎన్నికల్లో టీడీపీ తరఫున క్రియాశీలంగా పని చేశాడు. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు (57)ను స్థానిక చేపల మార్కెట్ సమీపంలో పథకం ప్రకారం జూన్ 29న పట్టపగలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కుట్రదారునిగా కేసు నమోదు కాగా ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఘటన జరిగి ఐదు నెలలు తిరక్కుండానే మంత్రి నానిపై టీడీపీ కార్యకర్త హత్యాయత్నానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. పలువురు మంత్రులు పరామర్శ మంత్రి పేర్ని నానిని హోంమంత్రి మేకపాటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, సింహాద్రి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ముదునూరి ప్రసాదరాజు, వల్లభనేని వంశీ, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత తదితరులు పరామర్శించారు. ఏ ఉద్దేశంతో ఈ చర్యకు ఒడిగట్టాడో.. నా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ నేరుగా కలుస్తాను. అందువల్ల ప్రజలకు, నాకు మధ్య స్కానింగ్‌లు, చెకింగ్లు వద్దని భద్రతా సిబ్బందికి చెబుతాను. ఈ రోజు మా అమ్మగారి పెద్ద కర్మ కోసం ఇంటి వద్ద పూజాధికాలు ముగించుకుని మార్కెట్ యార్డుకు బయల్దేరుతున్న సమయంలో బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి నా కాళ్లకు దణ్ణం పెట్టేందుకు అన్నట్టుగా వంగి నాపై దాడికి యత్నించాడు. రెండసార్లు పొడించేందుకు ప్రయత్నించగా అదృష్టవశాత్తు తప్పించుకున్నా. అతను ఎన్నికల్లో టీడీపీ తరఫున యాక్టివ్‌గా తిరిగాడు. ఎందుకు ఈ చర్యకు ఒడిగట్టాడో తెలియడం లేదు. కారణాలేమిటనేది పోలీసుల విచారణలో బయట కొస్తాయి. – పేర్ని నాని, మంత్రి విచారణ ప్రారంభించాం నిందితుడు నాగేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడు. మంత్రిపై హత్యాయత్నం వెనుక ఎవరి హస్తముందో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. ఈ ఘటన వెనుక రాజకీయ కోణమా.. లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మంత్రి పేర్ని నానిని కలిసి తన బాధను చెప్పుకోడానికి వచ్చినట్టు నిందితుడు చెబుతున్నాడు. బాధ చెప్పుకునే వ్యక్తి.. ఆయుధంతో ఎందుకు వచ్చాడో విచారణ జరుపుతున్నాం. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ హత్యాయత్నానికి ఉపయోగించిన తాపీ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బడుగు నాగేశ్వరరావు పేర్ని నానితో మాట్లాడుతున్న డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, శాసనసభ్యులు సింహాద్రి రమేష్, ప్రసాదరాజు, వల్లభనేని వంశీ -
మచిలీపట్నంలో మరో దారుణం
సాక్షి, కృష్ణా: మచిలీపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జ్యూయలరీ షాప్ యజమాని వరుణ్ మారుతీ ఉద్యోగిపై శనివారం కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ ఉద్యోగిని కత్తితో పొడిచి కాలువలో పడేశాడు. రాజేష్ పరిస్థితి విషయంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. కారు ఫైనాన్స్ వసూలు చేయడానికి వేళ్లిన వరుణ్ మారుతీ ఉద్యోగి రాజేష్‌పై జ్యూయలరీ షాప్ యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి హత్యాయత్నం కింద జ్యూయలరీ షాప్ యజమాని మీద కేసు నమోదు చేశారు. పారారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (కాల్ డాటా ఆధారంగానే రవీంద్ర అరెస్టు: ఎస్పీ) -
పేర్ని నాని ‘హ్యాట్రిక్’ విజయం
సాక్షి, చిలకలపూడి : బందరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముచ్చటగా మూడోసారి ఘన విజయం సాధించారు. ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. నియోజకవర్గంలో 1,84,506 ఓట్లు ఉండగా వీరిలో 1,46,476 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ నుంచి పేర్ని నాని ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. రెండో రౌండ్లో 18వ నెంబరు బూత్‌కు సంబంధించి ఈవీఎం మొరాయించడంతో లెక్కింపు ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం రౌండ్ల ప్రక్రియ కొనసాగుతుండగా 148వ నెంబరు బూత్‌కు సంబంధించిన ఈవీఎం కూడా మొరాయించింది. దీంతో రౌండ్ల సంఖ్య పూర్తైన అనంతరం ఆయా బూత్‌లకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్‌లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లలో పేర్ని నానికి ఆదిక్యత లభించింది. నియోజకవర్గవ్యాప్తంగా 2,161 పోస్టల్ బ్యాలెట్లు, 37 సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో 1121 పోస్టల్ బ్యాలెట్లు, 12 సర్వీస్ ఓట్లు ౖవైఎస్సార్ సీపీ అభ్యర్థి పేర్ని నానికి లభించాయి. 511 పోస్టల్ బ్యాలెట్లు, 9 సర్వీస్ ఓట్లు టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు లభించాయి. వీటిలో 613 ఓట్లు పేర్ని నానికి ఆధికంగా వచ్చాయి. అనంతరం 15 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిలో 65,008 వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు 59,770 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓటర్లు ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లను మొత్తం లెక్కిస్తే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కంటే పేర్ని నానికి 5,852 ఓట్లు ఆధిక్యత లభించింది. ఆయా రౌండ్ల వారీగా ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. -
ప్రకంపనలు రేపుతున్న వర్ల రామయ్య వ్యాఖ్యలు
-
జెడ్పీ పీఠంపై మరోమారు నారీమణి
సాక్షి, మచిలీపట్నం : కృష్ణా జిల్లా పరిషత్ 50 ఏళ్ల ప్రస్థానం పూర్తిచేసుకుంది. తొలి చైర్మన్‌గా చల్లపల్లి రాజా యర్లగడ్డ శివప్రసాద్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు మాత్రమే కొనసాగారు. ఆయన తరువాత ఎస్.వి.ఆర్.జి.నరసింహారావు కేవలం 19 రోజులపాటు ఇన్చార్జి బాధ్యతలు చూశారు. ఆయన తరువాత మాగంటి అంకినీడు జెడ్పీ చైర్మన్ బాధ్యతలను చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పదవిలో కొనసాగారు. ఆయన తరువాత జెడ్పీ పీఠాన్ని అధిష్టించిన పిన్నమనేని కోటేశ్వరరావు దాదాపు 12ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. అనంతరం ఎన్నికలు జరగకపోవడంతో నాలుగేళ్లపాటు ఐదుగురు కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా కొనసాగారు. 1981 జూలైలో జరి గిన ఎన్నికల్లో మరోమారు పిన్నమనేని కోటేశ్వరరావు చైర్మన్‌గిరి చేపట్టి ఏడాదిన్నర కొనసాగారు. ఆయన తరువాత రెండున్నర నెలలు కె.వెంకటరత్నం ఇన్చార్జిగా వ్యవహరించారు. అటుతరువాత చైర్మన్ బాధ్యతలు చేపట్టిన సుంకర సత్యనారాయణ మూడేళ్లకుపైగా పదవిలో కొనసాగారు. ఏడాదిపాటు ఎన్నికలు లేకపోవడంతో ఐఏఎస్ అధికారి ఆర్.భట్టాచార్య ప్రత్యేక అధికారిగా కొనసాగారు. 1987లో జరిగిన ఎన్నికల్లో పిన్నమనేని కోటేశ్వరరావు మూడోసారి చైర్మన్ కుర్చీ ఎక్కారు. మూడోసారి ఆయన ఐదేళ్లు పదవిలో కొనసాగారు. ఆయన తరువాత లంకా వెంకటరత్నానికి 17రోజు లపాటు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అటుతరువాత అప్పటి కలెక్టర్లు రాజీవ్ శర్మ, లక్ష్మీపార్థసారథి భాస్కర్ దాదాపు మూడేళ్లపాటు ప్రత్యేక అధికారులుగా కొనసాగారు. 1995 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కడియాల భాస్కరరావు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికై ఐదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన తరువాత మళ్లీ అప్పటి కలెక్టర్ బి.ఆర్.మీనా ఏడాదికిపైగా ప్రత్యేక అధికారిగా కొనసాగారు. 2001లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీ పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళా ప్రజాప్రతినిధిగా నల్లగట్ల సుధారాణి ఐదేళ్లు పాలన కొనసాగించారు. 2006లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన డాక్టర్ కుక్కల నాగేశ్వరరావు ఐదేళ్లపాటు పదవిలో కొనసాగడమే కాకుండా జిల్లాను ప్రగతిబాట పయనించేలా కృషి చేశారు. అనేక అరుదైన రికార్డులు నెలకొల్పి అవార్డులు దక్కించుకున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు రెండున్నరేళ్లకుపైగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కలెక్టర్లు ఎస్.ఎ.ఎం.రిజ్వీ, బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి, ఎం.రఘునందనరావు ప్రత్యేక అధికారులుగా కొనసాగారు. తాజాగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి మహిళలకు కేటాయించారు. దీంతో రెండోసారి మహిళామణి జెడ్పీ పీఠం అధిష్టించనున్నారు. -
అసమ్మతి ఆనవాయితీ
సాక్షి, మచిలీపట్నం : కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. అక్కడ ప్రధాన పార్టీల నాయకులకు అసమ్మతి బెడద, వర్గపోరు ఆనవాయితీగా వస్తోంది. దీనికితోడు ఇక్కడ ఒకసారి ఓడిస్తే మరో ఎన్నికలో సానుభూతితో గెలిపించే సంప్రదాయం కూడా ఓటర్లలో ఉంది. ఫలితంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో ఆ నియోజకవర్గం ‘గన్’వరంగా గుర్తింపు పొందింది. 1994 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గద్దె రామ్మోహన్రావు ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. గద్దె చేతిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు పరాజయంపాలయ్యారు. అప్పట్లో సానుభూతి ఓట్లతో గద్దె గెలవడంతో ఓటమిపాలైన బాలవర్థనరావు ఉడా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం గద్దె తిరిగి టీడీపీలో చేరడంతో 1994 నుంచి 1999 వరకు గద్దె, దాసరి రెండు వర్గాలుగా గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ ఎంపీగా గద్దెను పంపి దాసరికి గన్నవరం సీటు కేటాయించి వర్గ వైషమ్యాలను సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు. 1999 ఎన్నికల్లో అప్పటి ఎంపీ కావూరు సాంబశివరావు మద్దతుతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ పొంది గన్నవరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముద్దరబోయినకు అప్పటి ఎన్నికల్లో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వ్యతిరేకంగా పనిచేసి ఓడించారు. కాంగ్రెస్‌లో అసమ్మతికితోడు ప్రజల్లో సానుభూతి తోడుకావడంతో 1999 ఎన్నికల్లో దాసరి విజయం సాధించారు. ఓటమి పొందిన ముద్దరబోయిన నియోజకవర్గంలో మకాం పెట్టి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. అంతకుముందు రెండు ఎన్నికల నుంచి చెల్లాచెదురైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన ముద్దరబోయినకు 2004 ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించలేదు. అధిష్ఠానం కడియాల బుచ్చిబాబును కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికచేయడంతో బిత్తరపోయిన ముద్దరబోయిన కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009 ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించినప్పటికీ టీడీపీ తరపున పోటీ చేసిన దాసరి చేతిలో పరాజయం పాలుకాక తప్పలేదు. తాజాగా.. గన్నవరంలో గతం నుంచి కాంగ్రెస్, టీడీపీ నువ్వానేనా అనే రీతిలో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చిరునామా గల్లంతైంది. వైఎస్సార్సీపీ పట్టు సాధించింది. ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశంలో మాత్రం అసమ్మతి అనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్లు ఇద్దరూ టికెట్ నాది అంటే నాది అంటూ పంతాలకు పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారి సామాజికవర్గానికి చెందిన పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా వీరిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగిలిన వారు అసమ్మతి అనవాయితీని కొనసాగిస్తూ రెబల్ అవుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
నేడు అనూహ్య అంత్యక్రియలు
ముంబైలో దారుణహత్యకు గురైన అనూహ్య ఈస్తర్ మృతదేహం మచిలీపట్నానికి చేరుకుంది. శనివారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న అనూహ్య.. క్రిస్మస్ సెలవలకు వచ్చి, తిరిగి వెళ్లి.. ఇంటికి చేరుకోకుండానే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అనూహ్యను బలమైన ఆయుధంతోనే కొట్టి చంపినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. ఆమె దేహంపై పలు చోట్ల గాయాలున్నాయని, మర్మావయవాలపైనా గాయాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనేది మాత్రం ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే తెలుస్తుందంటున్నారు. ముంబై పోలీసులు కేసు దర్యాప్తులో తీవ్ర అలసత్వం ప్రదర్శించారని అనూహ్య తండ్రి ప్రసాద్ చెప్పారు. ఎంతసేపూ ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారే తప్ప.. ఎవరైనా దుండగులు ఆమెపై దాడి చేశారా అనే కోణంలో ఆలోచించలేదని ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఈ కోణంలో దర్యాప్తు చేసి ఉంటే తమ కుమార్తె తమకు దక్కి ఉండేదని, ఇప్పుడిలా మృతదేహంలా చూసుకోవాల్సి వస్తోందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
నేడు అనూహ్య అంత్యక్రియలు
-
అనూహ్యను చంపింది క్యాబ్ డ్రైవరేనా?
ముంబైలో హత్యకు గురైన మచిలీపట్నం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయమై డీజీపీ బి. ప్రసాదరావు ముంబై పోలీసులను సంప్రదించారు. అక్కడ జరిగిన విషయాలు, ఆ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనూహ్య రైలు దిగిన తర్వాత క్యాబ్‌లో తన హాస్టల్‌కు బయల్దేరి ఉంటుందని, బహుశా క్యాబ్ డ్రైవరే ఆమెను హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మచిలీపట్నానికి చెందిన ఈస్తర్ అనూహ్య (23) ముంబైలో టీసీఎస్‌లో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. క్రిస్మస్ సెలవులు కావటంతో సొంత ఊరికి వచ్చిన అనూహ్య.... ముంబై వెళ్లేందుకు ఈ నెల 4న విజయవాడలో విశాఖపట్నం-ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. ఆ రోజు రాత్రి పది గంటలకు తండ్రికి ఫోన్ చేసిన అనూహ్య... ఆ తరువాత... హాస్టల్‌కు వెళ్లాక మాట్లాడుతానంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తరువాత అనూహ్య నుంచి ఫోన్ రాలేదు. దాంతో ఆమె తండ్రి ప్రసాద్.... అనూహ్యకు ఎన్నికాల్స్ చేసినా సమాధానం లేదు. అనంతరం ఆయన అంథేరీ హాస్టల్లోని అనూహ్య స్నేహితురాలికి ఫోన్ చేసినా అక్కడ నుంచి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ప్రసాద్ ఈ నెల 5వ తేదీన అనూహ్య కన్పించటం లేదంటూ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి 11 రోజుల తరువాత... కంజుమార్గ్‌లోని కాలిన గాయాలతో కుళ్లిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమె చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా మృతదేహం అనూహ్యదిగా ఆమె తండ్రి గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
9తేదీ వరకూ అనూహ్య ఫోన్‌కు సిగ్నల్స్
ముంబయిలో దారుణ హత్యకు గురైన సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య కేసు దర్యాప్తులో రైల్వే పోలీసుల నిర్లక్ష్యం లేదని రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ స్ఫష్టం చేశారు. ఈ నెల 5న ఆమె ముంబయి లోకమాన్య తిలక్ రైల్వేస్టేషన్లో దిగినట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో కేసు దర్యాప్తు వివరాలు కనుగొని ముంబయి పోలీసులకు సమాచారం అందించామన్నారు. మహారాష్ట్ర నుంచి 9వ తేదీ వరకూ అనూహ్య ఫోన్‌కు సిగ్నల్స్ ఉన్నట్లు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన 23 ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
మహిళా సాప్ట్వేర్ ఇంజనీర్ హత్య