సాక్షి, కృష్ణా: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్ధేశమని తెలిపారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.
ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ.. సంస్కరణ తీసుకురావాలనేది మీ బిడ్డ ఆలోచన అని సీఎం జగన్ తెలిపారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్‌డేట్ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ యాక్ట్ గొప్పదని టీడీపీ నేత పయ్యావులే అసెంబ్లీలో చెప్పాడని ప్రస్తావించారు.
మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. బాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ గోయింగ్ స్కీమ్స్‌ను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని నిప్పులు చెరిగారు.
సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్
జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధి
పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే
బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమే
చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.
పేదల శత్రువులంతా ఒక్కటయ్యారు
చంద్రబాబువి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే
14 ఏళ్లో చంద్రబాబు ఒక్క మంచిపనైననా చేశాడా?
చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?
ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు
2 లక్షల కోట్ల డ్రగ్స్ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడు
ఆ డ్రగ్స్ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని తేలింది.తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్
59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
130 సార్లు బటన్ నొక్కి వివిధ పథకాల ద్వారా మంచి చేశాం
పేదలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం
2 లక్షల 31 వేలకుపైగా ఉద్యోగాలిచ్చాం
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
ప్రభుత్వ బడుల్లో 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు
ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన
విద్యార్థులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, బైజూస్ కంటెంట్
బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్ద
ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన
విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?
అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత
అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం
అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?
అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్
ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు
పెట్టుబడి సాయంతో రైతులకు అండగా నిలబడ్డాం
రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నాం
విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం
జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు ఆర్ధిక సాయం
మత్స్యకార భరోసా, లా నేస్తం, వాహనమిత్ర ద్వారా ఆదుకున్నాం
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి కార్యక్రమాలూ చూశారా
మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్ హార్బర్
మచిలీపట్నం అభివృద్ధికి బాటలు వేసింది మీ బిడ్డ జగనే.
రూ.5100 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతుంది
మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశాం
బందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్ హార్బర్
గతంలో ఇంత మంచి ఎప్పుడైనా మీరు చూశారా?
Comments
Please login to add a commentAdd a comment