AP Election Update: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ | Count Down Starts For AP Election Results Live Updates | Sakshi
Sakshi News home page

AP Elections Counting: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌ అప్‌డేట్స్‌

Published Mon, Jun 3 2024 7:39 AM | Last Updated on Mon, Jun 3 2024 5:12 PM

Count Down Starts For AP Election Results Live Updates

AP Elections Counting Count Down

4:37 PM, 3rd June, 2024

విజయవాడ

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

  • మొత్తం 16 నియోజకవర్గాలకి నాలుగు కౌంటింగ్ కేంద్రాలు
  • కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఏలూరు లో కౌంటింగ్ సెంటర్
  • మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మవిలీపట్నం నియోజకవర్గాలకి మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్
  • విజయవాడ పార్లమెంట్ తో పాటు విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకి ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో కౌంటింగ్
  • విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్
  • మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్ధులు, అసెంబ్లీకి 79 మంది అభ్యర్ధులు
  • విజయవాడ పార్లమెంట్ పరిధిలో 17, అసెంబ్లీకి 96 మంది అభ్యర్ధులు
  • ఎన్టీఆర్ జిల్లాలో 79.5 %, కృష్ణా జిల్లాలో 84.45% పోలింగ్
  • విజయవాడ పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న 13,52,964 ఓటర్లు
  • మచిలీపట్నం పార్లమెంట్ లో ఓటుహక్కు వినియోగించుకున్న 12,93,948 ఓటర్లు
  • మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
  • ప్రతీ రౌండ్‌కి  14 టేబుళ్లు ఏర్పాటు
  • ప్రతీ రౌండ్ ఫలితానికి 25 నిమిషాల సమయం
  • సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడికి అవకాశం
  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం మచిలీపట్నం...ఇక్కడ 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్
  • గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరులలో చివరి ఫలితాలు..ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

2:19 PM, 3rd June, 2024

కర్నూలు:

 కర్నూలు జిల్లా వ్యాప్తంగా భద్రత ఏర్పాటు చేశాం: కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్

  • సెంట్రల్, లోకల్ పోలీసుల ద్వారా నాలుగు అంచుల భద్రత ఏర్పాటు చేశాము.
  • కౌంటింగ్ హల్‌లో కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము.
  • కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లు వివిధ రూపాల్లో కౌంటింగ్ పాస్స్ లు కల్పించాము
  • కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో 1000 మంది పోలీసులను ఏర్పాటు చేశాము, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది
  • 188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్స్ ఏర్పాటు చేశాము.
  • ఫలితాలు వచ్చిన తరువాత కూడా భద్రత ఏర్పాట్లను చేశాం, ఫలితాలు వచ్చిన తరువాత ర్యాలీలు, సంబరాలు జరుపుకోవడం నిషేధం
  • ఎన్నికల తనిఖీలల్లో భాగంగా 11 కోట్లు రూపాయాల విలువ చేసే 80 లక్షల నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువులను పట్టుకున్నాము
  • 7 వేలు దాకా కర్నూలు జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేశాం
  • కౌంటింగ్ సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేశాం
     

2:15 PM, 3rd June, 2024
ఏపీలో ఈసీ కొత్త నిబంధన ఎందుకు?: సజ్జల

  • దేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధన
  • దేశంలో ఎక్కడాలేని నిబంధనలు ఏపీలో మాత్రమే పెట్టారు.
  • అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
  • చంద్రబాబు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • బాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు.
  • ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతాకం ఉంటే చాలనే నిబంధన పెట్టారు.
  • కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.
  • చంద్రబాబుకు బీజేపీతో పొత్తు లేకుంటే కరెక్ట్‌ ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేవి.

 

1:50 PM, 3rd June, 2024
గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ హరీష్‌ గుప్తా వార్నింగ్‌

  • అమరావతి..
  • డీజీపీ కార్యాలయం ప్రకటన
  • కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్
  • రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
  • డీజీపీ హరీష్‌ గుప్తా కామెంట్స్‌..
  • గీత దాటితే తాట తీస్తాం.
  • సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తప్పవు.
  • కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారు
  • వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు
  • అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు
  • IT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం.
  • PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు..
  • పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో  వారిపై కూడా విచారణ చేస్తాం.
  • రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం.
  • గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్‌గా ఉండాలి.
  • సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది.

 

1:30 PM, 3rd June, 2024
కౌంటింగ్‌కు ఏ‍ర్పాట్లు పూర్తి: సీఈవో మీనా

  • అమరావతి..
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్‌..
  • రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
  • పార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
  • అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి
  • ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది
  • 8.30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుంది
  • పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుంది
  • పార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభం
  • కౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది

 

1:00 PM, 3rd June, 2024
విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ 

  • కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి కామెంట్స్..
  • కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగింది.    
  • పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగాయి.
  • ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.
  • విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు .
  • 144 సెక్షన్ అమలులో ఉంది.
  • రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలి.
  • 50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.
  • 133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసాం.
  • 70 కేసులు నమోదు చేశాం.
  • 40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేశాం.
  • కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు.
  • స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపాం.
  • సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీసులను మోహరించాం.
  • చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు.

 

12:45 PM, 3rd June, 2024
ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డి

  • విశాఖ..
  • వైస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్‌..
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.
  • ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.
  • ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
  • సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు.
  • మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు.
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు.

 

11:59 AM, 3rd June, 2024
పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలు

  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలు
  • కౌంటింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశం
  • పిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్‌
  • ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌
  • అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులు
  • కోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లి
  • తాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీ
  • టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా ఆదేశాలు
  • ఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 

11:30 AM, 3rd June, 2024
పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డి

  • విశాఖ:
  • వైఎస్సార్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.
  • కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.
  • ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 

 

10:40 AM, 3rd June, 2024
వైఎస్సార్‌సీపీదే విజయం: అబ్బయ్య చౌదరి

  • ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌
  • ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీదే విజయమని తేల్చేశాయి. 
  • సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. 

 

 

10:15 AM, 3rd June, 2024
YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

  • నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణ
  • విచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం
  • జాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసు
  • రేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే  విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీ
  • ఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు
  • ఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ  
  • అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్  సిగ్నేచర్ తో  పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న  ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీ
  • ఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న  నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీ
  • పోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్
  • కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ

9:43 AM, 3rd June, 2024
విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

విజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దం

సాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళిక

ఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్

నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్

పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లు

ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటు

ఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198  టేబుళ్లు ఏర్పాటు

17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటు

రెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలు

పోస్టల్‌ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశం

ఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనా

ఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపు

కౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదు

సీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ

8:30 AM, 3rd June, 2024
నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కేసు..

  • ఢిల్లీ:
  • నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు
  • ఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీ
  • అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీ
  • నేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాది
  • ఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీ
  • పోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్
  • కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ
     

8:15 AM, 3rd June, 2024
నేడు ఈసీ మీడియా సమావేశం..

  • ఢిల్లీ:
  • నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం
  • రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం

 

8:00 AM, 3rd June, 2024
కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ..

  • ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం
  • మరో 24 గంటల్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.
  • కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.
  • ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.
  • కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీ
  • సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌
  • మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌
  • ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్‌ ఫోకస్‌
  • ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు 
  • మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ప్రెస్‌మీట్‌
  • నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం

 

అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

  • అనంతపురం:
  • ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు
  • అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు
  • 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు
  • ఆరు వేల మంది బైండోవర్
  • 400 మందిపై రౌడీషీట్లు
  • రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలు

తిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..

  • తిరుపతి
  • తిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులు
  • రేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు
  • ఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,
  • 8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం
  • కౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత
  • 144 సెక్షన్ అమలులో ఉంది,
  • 2 కంపెనీలు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు జిల్లాకు కేటాయింపు
  • కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదు
  • ఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు

 

ఏజెంట్లే కీలకం

  • ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి 
  • ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్‌ నియామక పత్రం ఉండాలి 
  • ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి 
  • అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి 
  • తుది ఫలితం ప్రకటించే దాకా హాల్‌ విడిచి వెళ్లకూడదు 
  • కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు  
  • ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి  

 

అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్‌ మీనా

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా కామెంట్స్‌..
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండి

  • పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి

  • ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి

 

లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్‌’ పక్కా

  • అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ

  • దేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే మాట

  • 50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్‌

  • 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న దైనిక్‌ భాస్కర్‌(డీబీ)

  • రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్‌ పోల్స్‌లో 24 పోల్స్‌ వైఎస్సార్‌సీపీ వైపే

  • బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్‌డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి

  • ‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్‌ఎన్‌ న్యూస్‌–18 ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే దారి

  • 2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌

  • తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్‌సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థ

  • గుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులు

  • తాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్‌ 

  • మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్‌సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలు

  • బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌

  • రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్‌డీఏ గెలుస్తుందని వెల్లడి

  • రాజధాని, స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలు

  • కానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరు

  • బాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవు

  • హైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్‌’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులు

  • వాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీ

  • తమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలు

  • ఇవన్నీ వైఎస్సార్‌సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలు

  • సెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement