61,687 ఓట్ల మెజార్టీ.. 65.50 శాతం ఓట్లు
కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు ఎదురే లేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు రుజువు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 1,77,580 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో జగన్‌కు 1,16,315 (65.50 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవిపై 61,687 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 54,628 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డికి 10,083 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 23 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండులోనూ వైఎస్ జగన్ తన ఆధిక్యతను చాటుకోవడం విశేషం. పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో వైఎస్సార్ కుటుంబం ఎంతో కృషి చేసింది. అందుకే పులివెందులలో వైఎస్సార్ కుటుంబానికి ప్రజలు 1978 నుంచి పట్టం కడుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment