Counting Agents
-
వెలుగులోకి మరో ‘కౌంటింగ్’ మాయ
అచ్చంపేట: ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈవీఎం మారిపోయిన సంఘటన ఇప్పటికే బయటపడగా, తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పడేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలోని అచ్చంపేట జెడ్పీ హైస్కూల్లో ఉన్న 56వ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పెట్టేశారని కౌంటింగ్ ఏజెంట్లు తెలిపారు.దీనిపై అధికారులను ప్రశ్నించగా, ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అది ఓపెన్ కావడంలేదని, అందువల్ల లెక్కింపు సాధ్యం కావడంలేదని చెప్పారని ఏజెంట్లు చెప్పారు. ఈ బూత్‌లో మొత్తం 737 ఓట్లు ఉన్నాయి. అందులో 357 మంది పురుషులు, 380 మంది మహిళలు ఉన్నారు. అచ్చంపేట మండలంలో 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీకి 7,597 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి టీడీపీకి ఈ మండలంలో 161 ఓట్ల మెజార్టీ వచ్చింది.అయితే, 56వ పోలింగ్ బూత్‌లో ఓట్లను లెక్కించకుండానే టీడీపీకి 161 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు ఎలా ధృవీకరిస్తారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా, చేశారని, వైఎస్సార్సీపీని దెబ్బ తీయడానికి ఇంకా బయటపడని ఘోరాలు ఇంకెన్ని జరిగాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
AP Election Update: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్
AP Elections Counting Count Down4:37 PM, 3rd June, 2024విజయవాడఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిమొత్తం 16 నియోజకవర్గాలకి నాలుగు కౌంటింగ్ కేంద్రాలుకైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఏలూరు లో కౌంటింగ్ సెంటర్మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మవిలీపట్నం నియోజకవర్గాలకి మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్విజయవాడ పార్లమెంట్ తో పాటు విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకి ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో కౌంటింగ్విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్ధులు, అసెంబ్లీకి 79 మంది అభ్యర్ధులువిజయవాడ పార్లమెంట్ పరిధిలో 17, అసెంబ్లీకి 96 మంది అభ్యర్ధులుఎన్టీఆర్ జిల్లాలో 79.5 %, కృష్ణా జిల్లాలో 84.45% పోలింగ్విజయవాడ పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న 13,52,964 ఓటర్లుమచిలీపట్నం పార్లమెంట్ లో ఓటుహక్కు వినియోగించుకున్న 12,93,948 ఓటర్లుమచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిప్రతీ రౌండ్‌కి 14 టేబుళ్లు ఏర్పాటుప్రతీ రౌండ్ ఫలితానికి 25 నిమిషాల సమయంసాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడికి అవకాశంఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం మచిలీపట్నం...ఇక్కడ 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరులలో చివరి ఫలితాలు..ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు2:19 PM, 3rd June, 2024కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా భద్రత ఏర్పాటు చేశాం: కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్సెంట్రల్, లోకల్ పోలీసుల ద్వారా నాలుగు అంచుల భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ హల్లో కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లు వివిధ రూపాల్లో కౌంటింగ్ పాస్స్ లు కల్పించాముకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో 1000 మంది పోలీసులను ఏర్పాటు చేశాము, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్స్ ఏర్పాటు చేశాము.ఫలితాలు వచ్చిన తరువాత కూడా భద్రత ఏర్పాట్లను చేశాం, ఫలితాలు వచ్చిన తరువాత ర్యాలీలు, సంబరాలు జరుపుకోవడం నిషేధంఎన్నికల తనిఖీలల్లో భాగంగా 11 కోట్లు రూపాయాల విలువ చేసే 80 లక్షల నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువులను పట్టుకున్నాము7 వేలు దాకా కర్నూలు జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేశాంకౌంటింగ్ సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేశాం 2:15 PM, 3rd June, 2024ఏపీలో ఈసీ కొత్త నిబంధన ఎందుకు?: సజ్జలదేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధనదేశంలో ఎక్కడాలేని నిబంధనలు ఏపీలో మాత్రమే పెట్టారు.అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు.ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతాకం ఉంటే చాలనే నిబంధన పెట్టారు.కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.చంద్రబాబుకు బీజేపీతో పొత్తు లేకుంటే కరెక్ట్ ఎగ్జిట్‌పోల్స్ వచ్చేవి. 1:50 PM, 3rd June, 2024గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ హరీష్ గుప్తా వార్నింగ్‌అమరావతి..డీజీపీ కార్యాలయం ప్రకటనకౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాడీజీపీ హరీష్ గుప్తా కామెంట్స్..గీత దాటితే తాట తీస్తాం.సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారువ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారుఅలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవుIT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం.PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు..పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో వారిపై కూడా విచారణ చేస్తాం.రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం.గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్‌గా ఉండాలి.సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. 1:30 PM, 3rd June, 2024కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో మీనాఅమరావతి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్..రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారుఅన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయిముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది8.30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందిపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందిపార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభంకౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది 1:00 PM, 3rd June, 2024విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి కామెంట్స్..కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగింది. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగాయి.ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు .144 సెక్షన్ అమలులో ఉంది.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలి.50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసాం.70 కేసులు నమోదు చేశాం.40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేశాం.కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు.స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపాం.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీసులను మోహరించాం.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. 12:45 PM, 3rd June, 2024ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డివిశాఖ..వైస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు.మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు.వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. 11:59 AM, 3rd June, 2024పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలుకౌంటింగ్ రోజు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశంపిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్‌ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులుకోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లితాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీటీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా ఆదేశాలుఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 11:30 AM, 3rd June, 2024పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డివిశాఖ:వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 10:40 AM, 3rd June, 2024వైఎస్సార్సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ వైఎస్సార్సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్ఆర్సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్ బ్యాలెట్ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్ ఫోకస్‌ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్ మీనా ప్రెస్‌మీట్‌నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్ఎఫ్ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కామెంట్స్..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూప్‌ల ఎగ్జిట్ పోల్స్‌దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 పోల్స్ వైఎస్సార్సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్ఎన్ న్యూస్–18 ఎగ్జిట్ పోల్స్‌దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్ -
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్‌షాప్, జూమ్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్‌లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్‌లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి: రాజీవ్‌కుమార్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని.. ఇందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాల సీఈవోలు, ఎన్నికల అధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలసి రాజీవ్‌కుమార్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరి సమిష్టి కృషితో దేశవ్యాప్తంగా ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు.. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపు గురించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాజీవ్‌కుమార్ ఆదేశించారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా.. ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలని స్పష్టం చేశారు. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ‘లెక్కింపు పూర్తి అయినట్లుగా’ ఆయా ఈవీఎంలపై మార్క్ చేయాలని ఆదేశించారు. ఆ వెంటనే సీల్ చేసి ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనవసరంగా ఈవీఎంలను అటూ, ఇటూ కదిలించవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుళ్లు, స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని.. డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వీవీప్యాట్ లెక్కింపు చివర్లోనే
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ చీటీల లెక్కింపు జరపాలన్న 22 విపక్ష పార్టీల డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఈసీని కలసి ఈ మేరకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళ, బుధవారాల్లో రెండు దఫాలుగా లోతుగా చర్చించామని, మొత్తం మీద, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది ఆచరణ సాధ్యం కాదని, విపక్షాల డిమాండ్‌కు అంగీకరించే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కాగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటే అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను కూడా అనుమతించే అంశంపై ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాల్సిందిగా ఏప్రిల్ 8 నాటి తీర్పులో ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా బలహీన కమిషన్ : కాంగ్రెస్ ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి బలహీన కమిషన్‌గా ఈసీని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈసీ ఈవీఎంలను బీజేపీకి విజయాన్ని చేకూర్చే ‘ఎలక్ట్రానిక్ విక్టరీ మిషన్లు’గా ఏమన్నా మార్చిందా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి)ను ‘మోదీస్ క్యాంపెయిన్ కోడ్’గా (మోదీ ప్రచార నియమావళి) మార్చారా? అంటూ నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ఒత్తిళ్లకు ఈసీ లొంగిపోయిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరించడం విచారకరం, దురదృష్టమని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. శాంపిల్‌ను తొలుత పరీక్షించాలన్న ప్రాథమిక సూత్రానికి ఈసీ ఎందుకు కట్టుబడటం లేదో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. డీఎంకే సైతం ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్ కేవలం ప్రదాని మోదీ మాటే వింటుందా? అని ఆ పార్టీ సీనియర్ నేత దొరైమురుగన్ ప్రశ్నించారు. విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధం: అమిత్ వీవీ ప్యాట్లను తొలుత లెక్కించాలన్న విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్నారు. ఆరో విడత ఎన్నికల తర్వాతే విపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాయని, ఎగ్జిట్ పోల్స్ తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశాయని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారని బుధవారం నాటి ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. మూడు వ్యాజ్యాలను (పిల్స్) విచారించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు తుదిరూపునిచ్చిందని అమిత్ షా చెప్పారు. వీవీప్యాట్లపై విపక్షాల అసహనం ఎన్నికల్లో వారి ఓటమికి సంకేతంగా కేంద్ర మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. -
కౌంటింగ్ కేంద్రల వద్ద సివిల్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత
-
‘నేరచరితులకు అనుమతి లేదు’
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి పాస్‌లు ఉన్న వారిని మాత్రమే మద్దిలపాలెం, త్రీ టౌన్ రోడ్లో ఉన్న గేట్ ద్వారా అనుమతినిస్తామని కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ నేరచరితులను అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వచ్చిన 1430 మంది ఏజెంట్ల జాబితాలో 40 మంది పైన కేసులున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులకు మినహా మరెవరికీ సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమితి లేదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ అన్నారు. 1272 మంది సివిల్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీలు, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్కు చెందిన కంపెనీలు, ఏపీఎస్పీకు చెందిన ప్రత్యేక బృందాలను విధుల్లో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 32 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. సెక్షన్ 144, 30 అమల్లో ఉన్నందున విజయోత్సవాలు, ఆందోళనలు, ధర్నాలు, సమావేశాలు, సభలు నిషేధమని కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కౌంటింగ్ కేంద్రల వద్ద సివిల్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత -
అర్ధరాత్రి తరువాతే తుది ఫలితం
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు పూర్తిచేసి అధికారికంగా విజేతను ప్రకటించేందుకు కనీసం 14 నుంచి 16 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 23వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైతే అర్ధరాత్రి తరువాత తుది ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. 2014 ఎన్నికల నాటి లెక్కింపు ప్రక్రియతో పోల్చితే ఈసారి అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో వీవీ ప్యాట్ ప్రక్రియ లేదు. ఈసారి వాటిని ప్రవేశ పెట్టారు. వాటి లెక్క తేల్చడానికే అధిక సమయం పడుతుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రతి రౌండులో రెండు యంత్రాలను ర్యాండమ్ పద్ధతిలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎంపిక చేసి లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా సంబంధిత రౌండుఫలితం ప్రకటిస్తారు. దీనివల్ల ఒక్కో ఈవీఎం ఓట్ల రౌండు లెక్కింపును పూర్తిచేయడానికి 30 నుంచి 45 నిమిషాలు పడుతుందని అధికారుల అంచనా. జిల్లాలో ఇంత వరకూ 40,145 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. గణన సమయానికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పూర్తిచేస్తే కానీ ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టడానికి అవకాశం లేదు. ఈ రెండూ పూర్తి చేసిన తర్వాతే వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టాలి. వీవీ ప్యాట్లకు ఆరు గంటలు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల చొప్పున లెక్కిస్తారు. వీటిని ఒకదాని తరువాత మరొకటి లెక్కించాలి. వీటి లెక్క పూర్తిచేయడానికి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు పూర్తి చేయగలిగితే, తర్వాత వీవీ ప్యాట్ల లెక్కింపు ముగించడానికి మరో ఆరు గంటల సమయం పడుతుంది. అంటే అర్ధరాత్రి దాటిన తరువాత విజేత పేరును అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. గంటలో తొలి రౌండ్ ఫలితం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తొలి రౌండు లెక్కింపు పూర్తయి ఫలితం అధికారికంగా ప్రకటించే సరికి ఉదయం 9.30 అవుతుందని భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి రౌండు 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో ముగుస్తుంది. ఈ లెక్కన 17 రౌండ్లు ఉండే సెగ్మెంట్ల ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి దాదాపు 9 గంటల సమయం పడుతుంది. జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశాలు కీలకం ♦ అనుకోని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైతే మరింత సమయం పట్టే అవకాశం ఉంది.∙వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయిన తరువాతే ఈసీ అనుమతితో అధికారికంగా విజేత పేరు ప్రకటిస్తారు. ♦ మధ్యాహ్నం, రాత్రి భోజన విరామ సమయాలను కలుపుకుంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ♦ వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తొలుత అభ్యర్థుల వారీ వచ్చిన ఓట్లను ›వేరు చేస్తారు. దీనివల్ల ఒక్కో వీవీ ప్యాట్లలో స్లిప్పుల లెక్కింపునకు గంటకు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ♦ జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓట్లు,పోలైన ఓట్లు వివరాలు ఇలా ఉన్నాయి -
ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలకు టీడీపీ స్కెచ్
-
కౌంటింగ్ నాడు టీడీపీ భారీ స్కెచ్..
సాక్షి, అమరావతి : ఎన్నికల కౌంటింగ్ రోజున పెద్ద ఎత్తున గొడవలకు తెరలేపేందుకు అధికార తెలుగుదేశం పార్టీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వడంతో ఆ పార్టీ వ్యూహం బట్టబయలైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి అభ్యర్థికి మెజారిటీ వస్తే ప్రతిరౌండ్‌లోను రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయాలని టీడీపీ తన కౌంటింగ్ ఏజెంట్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కౌంటింగ్ అధికారులతో గట్టిగా ఒత్తిడి చెయ్యాలని టీడీపీ నేతలు ఏజెంట్లను ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ఇచ్చిన శిక్షణలో ఇదే విషయాన్ని గట్టిగా టీడీపీ నాయకత్వం నూరిపోసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఏజెంట్ల బుక్‌లెట్‌లోనూ ఇదే విషయం ఉండటం టీడీపీ దురాలోచనను బయటపెట్టింది. ఓడిపోయేచోట కౌంటింగ్ ప్రక్రియ వివాదాస్పదం చేసి.. గొడవలకు తెరలేపాలని పార్టీ ఏజెంట్లకు టీడీపీ నాయకత్వం తప్పుడు సలహాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలకు టీడీపీ స్కెచ్ -
కట్టుదిట్టంగా కౌంటింగ్
కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్ జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు, కౌంటింగ్‌కు అంతరాయం చోటు చేసుకోకుండా మూడంచెల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ హాలుకు వంద మీటర్ల చుట్టూ డీ మార్కింగ్ చేస్తారు. దీన్ని పెడెస్ట్రియన్ జోన్ అంటారు. కౌంటింగ్ హాలుకు వంద మీటర్ల ఆవలనే వాహనాలను ఆపివేస్తారు. ఈ పెడెస్ట్రియన్ జోన్ చుట్టూ బ్యారికేడ్లు నిర్మిస్తారు. ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇక్కడ స్థానిక పోలీసులను నియమిస్తారు.కౌంటింగ్ ఆవరణలోకి వెళ్లే వారి గుర్తింపు పత్రాలను పోలీసులు పరిశీలిస్తారు. అధికారిక అనుమతి పత్రం, ఫొటో గుర్తింపు కార్డు లేకపోతే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు తదితరులను ఎవరినీ అనుమతించరు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మీడియా పాస్ ఉంటేనే పాత్రికేయులకైనా అనుమతి ఉంటుంది. మెజిస్టీరియల్ అధికారాలు కలిగిన సీనియర్ రెవెన్యూ అధికారి ఎంట్రీ పాయింట్ వద్ద ఉంటారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాలు దూరంగా ఉన్నప్పుడు ఈవీఎంలు తీసుకెళ్లడానికి అసౌకర్యంగా ఉంటుంది. కౌంటింగ్ హాలు వరకు ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బిల్డింగ్ ప్రవేశ ద్వారం నుంచి కౌంటింగ్ హాళ్ల వరకు ఉన్న ప్రదేశాన్ని రెండవ అంచెగా పరిగణిస్తారు. తగినంత మంది రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు ఇక్కడ ఉంటారు. ∙ఆడియో, వీడియో రికార్డు చేయగల మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించరు. అగ్గిపెట్టె, ఇంకుపెన్నులు, బ్లేడ్లు, చాకులు, పిన్నులు, ఆయుధాలను కౌంటింగ్ హాలులోకి తీసుకువెళ్లేందుకు అనుమతించరు. పెన్సిల్, వైట్ పేపర్స్ తీసుకువెళ్లవచ్చు. ∙రాష్ట్ర పోలీసులు మాత్రమే ఇక్కడ తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళలను కేవలం మహిళా పోలీసులు లేదా మహిళా హోం గార్డులు మాత్రమే తనిఖీ చేయాలి. ∙కౌంటింగ్ హాలు బయట నిలబడి ఎవరూ ఫోన్లలో మాట్లాడటం వంటివి చేయకూడదు. మీడియా లేదా పబ్లిక్ కమ్యూనికేషన్ రూములో మాత్రమే ఫోన్లలో మాట్లాడుకోవచ్చు. ఫోన్లు డిపాజిట్ చేసే సౌకర్యం ఉంటుంది. డిపాజిట్ చేసినప్పుడు టోకెన్లు జారీ చేస్తారు. ∙కౌంటింగ్ కేంద్రంలోకి కంట్రోల్ యూనిట్లు తీసుకెళ్లే సిబ్బంది కదలికలు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నున్న టీవీలో కనిపించే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుంది. ∙కౌంటింగ్ కేంద్రం ద్వారం నుంచి మూడు అంచెల భద్రత ప్రారంభమవుతుంది. ఇక్కడ సీఏపీఎఫ్ సిబ్బంది ఉంటారు. రిటర్నింగ్ అధికారి పిలిస్తే తప్ప వీరు కౌంటింగ్ హాలులోకి ప్రవేశించరాదు. ∙కౌంటింగ్ హాలులోకి నిషేధిత వస్తువులు తీసుకువెళ్లకుండా ఇక్కడ కూడా తనిఖీలు ఉంటాయి. కౌంటింగ్ హాలులో ఫొటోలు, వీడియోలు తీసేందుకు మీడియాకు అనుమతి ఉండదు. ∙కౌంటింగ్ హాలులోకి ఫోన్లు తీసుకెళ్లడానికి కేవలం ఈసీఐ అబ్జర్వర్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది లోనికి వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తారు. వీరికే లోనికి అనుమతి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఈసీఐ అనుమతి ఉన్న వ్యక్తులు, అబ్జర్వర్లు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లనులోనికి అనుమతిస్తారు. అభ్యర్థులైతేనే మంత్రులకు కౌంటింగ్ హాలులోకి ప్రవేశం ఉంటుంది. మంత్రులు ఎన్నికల ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు అనుమతించరు. ఒక నియోజకవర్గానికి రెండు కంటే ఎక్కువ కౌంటింగ్ కేంద్రాలను వినియోగించాల్సి వస్తే ఆ విషయాన్ని అభ్యర్థులకు తెలపాలి. అలాగే ఏ కౌంటింగ్ హాలుకు ఏ పోలింగ్ కేంద్రాలను కేటాయించిందీ ముందుగానే వివరించాలి. కౌంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా ఏజెంట్ అనుచితంగా ప్రవర్తించినా, నిబంధనలు పాటించకపోయినా బయటికి పంపి వేసే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. ఏజెంట్లు తమకు కేటాయించిన టేబుల్ వద్ద మాత్రమే కూర్చోవాలి. కౌంటింగ్ హాలు అంతా తిరిగేందుకు వారికి అనుమతి ఉండదు. -
వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు
-
కౌంటింగ్‌పై శిక్షణ.. మూడంచెల భద్రత
సాక్షి, విజయవాడ : ఈవీఎం, వీవీప్యాట్లు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఓట్ల లెక్కింపు విధానంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే వీడియో కవరేజ్ అంశాలపై ఈసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థుల వారిగా వీవీప్యాట్ స్లిప్పులను సాగ్రిగేట్చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థుల వారిగా 25 వీవీప్యాట్ స్లిప్పులను ఒక బండిల్‌గా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆర్వోలు పూర్తిగా నిర్థారణ చేసుకున్న తర్వాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు. -
కౌంట్ డౌన్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 42 రోజుల నుంచి నెలకొన్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. హోరాహోరీగా జరిగిన లోక్‌సభ పోరులో అభ్యర్థుల భవితవ్యం మరో ఐదు రోజుల్లో తేలనుంది. దీంతో దాదాపు నెలన్నర రోజుల పాటు స్తబ్దతగా ఉన్న పార్టీ నేతల్లో మళ్లీ హడావుడి మొదలైంది. పోలింగ్ తర్వాత వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమైన లోక్‌సభ అభ్యర్థుల్లో ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఉన్నా.. ఓటరన్న ఎవరిని ఆశీర్వదించాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గత నెల 11న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను ఈనెల 23న ఓట్ల లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు అధికారులూ కౌంటింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఎంపీ అభ్యర్థులు సైతంఓట్ల లెక్కింపు ఘట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈపాటికే కౌంటింగ్ ఏజెంట్ల ఎంపికలో తలమునకలయ్యారు. చురుకైన వారిని కౌంటింగ్ కేంద్రాల్లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండు చోట్లా హోరాహోరీ ఈసారి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి 12 మంది, నాగర్‌కర్నూల్ నుంచి 11 మంది పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఆయా పార్టీల అభ్యర్థులందరూ గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు తమ గెలుపుపై ప్రభావితం చేసే అంశాలపై దృష్టి సారించారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణ గట్టి పోటీ ఇచ్చారు. నాగర్కర్నూల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోరు కొనసాగింది. కాగా మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్, కోస్గి అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 15,05,151 ఓట్లు ఉండగా 9,82,888 పోలయ్యాయి. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 15,87,281 మంది ఓట్లు ఉంటే.. 9,92,226 పోలయ్యాయి. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే బూత్‌ల వారీగా నమోదైన ఓట్ల వివరాలు తెప్పించుకున్న పార్టీలు ఇప్పటికే ఎవరి గెలుపుపై వారు ధీమాతో ఉన్నారు. అయితే ఓటరన్న ఎవరిని ఆశీర్వదించాడో ఓట్ల లెక్కింపు రోజే తేలనుంది. రెండు స్థానాలు.. మూడు కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలు ఉండగా.. అధికారులు మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీ వద్ద ఉన్న జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ (జేపీఎన్సీఈ) లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారులు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో హాలు ఏర్పాటుచేశారు. ప్రతి నియోజకవర్గ హాలులో 14 టేబుళ్లు ఉంటాయి. మొత్తం 18 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంటు చొప్పున నియమించుకునే అవకాశం అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం కల్పించింది. వీరితోపాటు ఏజెంట్లందరికీ కలిపి మరో ఏజెంట్లను నియమించుకోవచ్చని సూచించింది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 5.30 గంటలకు అన్ని పార్టీల అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూం తెరుస్తారు. తర్వాత పోలింగ్ ప్రారంభం కానుంది. ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వీవీప్యాట్లను ఆయా రిటర్నింగ్ అధికారుల ముందు లెక్కిస్తారు. తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదిలావుండగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 615ను మహబూబ్‌నగర్ హాల్లోనే లెక్కిస్తారు. ∙నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి రెండు చోట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. వనపర్తి, కల్వకుర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను నాగర్‌కర్నూల్ శివారులోని ఉయ్యాలవాడలోని ప్రైవేట్ బీఎడ్ కాలేజీలో లెక్కించనున్నారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేసిన అధికారులు వీడియో, సీసీ కెమెరాల నిఘాలో ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించిన అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. అలాగే ఓట్ల లెక్కింపు, ఏర్పాట్లకు సంబంధించి అభ్యర్థులతో భేటీ అయిన రిటర్నింగ్ అధికారులు వారికి అవగాహన కల్పించారు. -
లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈనెల 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుపై గురువారం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి.. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల వివరాల లెక్కింపు, అందులోని దశలు, ప్రతి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌లలో గల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ కొండపల్లి శ్రీరామ్ శిక్షణ ఇచ్చారు. అనంతరం మైక్రో అబ్జర్వర్లకు సైతం శిక్షణ నిర్వహించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడిం బా, కలెక్టరేట్ ఏఓ మదన్‌గోపాల్, ఎన్నికల డీటీ రాంబాబు, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
-
కౌంటింగ్ ఏజెంట్లకు విధులు, బాధ్యతలపై ట్రైనింగ్ ఇచ్చాం
-
తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకూ..
సాక్షి, విజయవాడ : తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌లో గురువారం వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సాఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ సీఎస్ అజయ్ కల్లాం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల విధులు, బాధ్యతల గురించి ట్రైనింగ్ ఇచ్చామాన్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సహా మొత్తం 400 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఏజెంట్లు, రిజర్వ్ ఏజెంట్లు ఎంత మంది ఉండాలి.. వారికి ఉండాల్సిన అర్హతల గురించి వివరించామన్నారు. రౌండ్స్ వారిగా తీసుకోవాల్సిన చర్యలు.. రీకౌంటింగ్ ఏ సందర్భంలో కోరవచ్చో తెలియజేశామన్నారు. ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్ నిలుపుదల చేస్తే.. తక్షణమే రీకౌంటింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం పని చేస్తుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చాయో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పామన్నారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లిన తరువాత ఫోన్లు వాడకూడదని సూచించమన్నారు. ఎన్నికల కమిషన్ ప్రింట్ చేసి ఇచ్చిన మాన్యువల్ కూడా అందరికీ ఒక కాపీ అందజేశామన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కౌంటింగ్ ఏజెంట్లకు విధులు, బాధ్యతలపై ట్రైనింగ్ ఇచ్చాం -
కౌంటింగ్‌పై వైఎస్సార్ సీపీ కసరత్తు...
-
కౌంటింగ్ ఏజెంట్లకు వైఎస్సార్ సీపీ శిక్షణ
సాక్షి, విజయవాడ : ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు శిక్షణా శిబిరం గురువారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. విజయవాడలోని బందర్ రోడ్డు, డీవీ మానర్ హోటల్ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. మాజీ సీఎస్ అజయ్ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్, పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఏజెంట్ల విధులపై, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం కొనసాగనంది. శిక్షణకు హాజరవుతున్న వారు విధిగా సమయపాలన పాటించాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచనలు పంపింది. ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానితులతో పాటుగా చీఫ్ ఎన్నికల ఏజెంట్లు అంతా విధిగా హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు ఇప్పటికే ఓ సర్క్యులర్ పంపిన విషయం విదితమే. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు'
-
కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈసీ నిబంధనలు
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు అనుమతి లేదు సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అభ్యర్థుల తరఫున ఎవరెవరూ ఏజెంట్లుగా ఉండొచ్చనే నిబంధనలను స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోల)కు ఆదేశాలు జారీ చేసింది. సిట్టింగ్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అభ్యర్థుల తరఫున ఏజెంట్లుగా ఉండటానికి అనర్హులని ఈసీ స్పష్టం చేసింది. మునిసిపల్, నగర పంచాయతీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ సహకార సంస్థల చైర్మన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు నియమితులైన చైర్మన్లు కూడా ఏజెంట్లుగా అనర్హులని వెల్లడించింది. అలాగే ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులను ఏజెంట్లుగా అనుమతించరాదని పేర్కొంది. వారిని మినహాయించి 18 ఏళ్ల వయసు నిండిన వేరెవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చనిపేర్కొంది. స్థానికులనే నియమించుకోవాలనే నిబంధన ఏదీ లేదని వివరణ ఇచ్చింది. ప్రత్యేక సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సెక్యూరిటీ ఉంటే... ఆ సిబ్బందిని సరెండర్ చేసిన తర్వాతే వారిని అనుమతించాలని పేర్కొంది. ఎస్పీజీ భద్రత ఉన్న అభ్యర్థులైతే ఒకే ఒక్క ఎస్పీజీతో మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలని, ఆ ఎస్పీజీ వ్యక్తి కూడా సాధారణ దుస్తులు ధరించే రావాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. -
‘కౌంటింగ్’కు ‘వారు’ వద్దు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నిక లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లె క్కింపునకు పంచాయతీ సర్పంచ్‌లు, వా ర్డు సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, డెరైక్టర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించరాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 13న జడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ ఏజెం ట్లను అభ్యర్థులు ఎంపిక చేసి వారికి పాస్‌లు జారీ అ య్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జడ్పీటీసీ స్థానాలకు 1,560 మంది కౌంటింగ్ ఏజెంట్లు, ఎంపీటీసీ స్థానాలకు 2,371 ఏజెంట్లు అవసరం. ఎంపీ ఓట్ల లెక్కింపునకు 15 టేబుళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే స్థానానికి కూడా 15 టేబుళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థికి 15 మంది ఏజెంట్లు అవసరం అవుతారు. సాధారణంగా గట్టి పోటీ నిచ్చే అభ్యర్థులే కౌంటింగ్ ఏజెంట్లను నియమిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపునకు కూడా రిలీవర్లు ఉండటం లేదు. గతంలో మాత్రం సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, సహకార సంఘాల డెరైక్టర్లు, చైర్మన్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. ఈ నిబంధన మొదటి నుంచి ఉన్నా అమలు లేక పోవడం వల్ల ఎవరు సరిగా పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ ప్రతి నిబంధనను పకడ్బందీగా అమలుచేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేవారికి పలు నిబంధనలను అధికారులు విధించడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించరాదు
భోపాల్: కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు, తదితరులను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వారు సెక్యూరిటీ పరిధిలో ఉన్నా, లేకపోయినా కూడా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండరాదని ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి ఇతర ప్రభావాలు పడకుండా చూడటం తమ ఉద్దేశమని కమిషన్ తెలిపింది. భద్రతా పరిధిలోని ఎమ్మెల్యే లేదా రాజ్యసభ సభ్యుడిని పోలింగ్ ఏజెంట్ లేదా కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించవచ్చా? అంటూ పుదుచ్చేరి ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టతను కోరడంతో ఈసీ ఈ మేరకు వివరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, సాయుధ అంగరక్షకులతో కూడిన భద్రత ఉన్న ప్రజా ప్రతినిధులు కౌంటింగ్ ఏజెంట్‌గా ఉండరాదని గతంలో ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఉద్యోగులు చాలా మంది ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి.. వారు ప్రభావితం కాకుండా విధులు నిర్వర్తించేందుకుగాను మున్సిపల్ మేయర్లు, జిల్లా పరిషత్, పంచాయతీ వంటి స్థానిక సంస్థల చైర్మన్లు, అధ్యక్షులు కూడా ఏజెంట్లుగా ఉండరాదని తాజాగా నిర్ణయించినట్లు ఈసీ పేర్కొంది.