‘కౌంటింగ్’కు ‘వారు’ వద్దు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నిక లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లె క్కింపునకు పంచాయతీ సర్పంచ్‌లు, వా ర్డు సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, డెరైక్టర్‌లు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించరాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
ఈనెల 13న జడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ ఏజెం ట్లను అభ్యర్థులు ఎంపిక చేసి వారికి పాస్‌లు జారీ అ య్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జడ్పీటీసీ స్థానాలకు 1,560 మంది కౌంటింగ్ ఏజెంట్లు, ఎంపీటీసీ స్థానాలకు 2,371 ఏజెంట్లు అవసరం. ఎంపీ ఓట్ల లెక్కింపునకు 15 టేబుళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే స్థానానికి కూడా 15 టేబుళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థికి 15 మంది ఏజెంట్లు అవసరం అవుతారు.
సాధారణంగా గట్టి పోటీ నిచ్చే అభ్యర్థులే కౌంటింగ్ ఏజెంట్లను నియమిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపునకు కూడా రిలీవర్‌లు ఉండటం లేదు. గతంలో మాత్రం సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, సహకార సంఘాల డెరైక్టర్‌లు, చైర్మన్‌లు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. ఈ నిబంధన మొదటి నుంచి ఉన్నా అమలు లేక పోవడం వల్ల ఎవరు సరిగా పట్టించుకోలేదని అధికారులు తెలిపారు.
ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ ప్రతి నిబంధనను పకడ్బందీగా అమలుచేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేవారికి పలు నిబంధనలను అధికారులు విధించడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.