మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. మరో 26 రోజుల పాటు కోడ్ అమలులోనే ఉం డనుంది. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరగనుంది. ఆ తదనంతర ప్రక్రియ లు, లాంఛనాలు అన్నీ ముగిసే వరకు.. అంటే ఈ నెల 28వ తేదీ వరకు కోడ్ అమలులో ఉం టుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు, నూతన నిర్మాణాలకు మోక్షం లభించే మార్గాలు కనిపించడం లేదు.
అభివృద్ధి మాటే లేదు
జిల్లాలో అభివృద్ధిపై స్తబ్ధత నెలకొంది. సార్వత్రి క ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఒక్కసారి గా రాజకీయ వాతావరణం చల్లబడింది. అయి తే అధికారిక కార్యక్రమాలు మాత్రం కుంటుపడ్డాయి. అభివృద్ధి పనులకు, నిధుల మంజూరుకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారడంతో ప్రజాప్రతినిధులు సైతం డీలా పడిపోతున్నారు. జిల్లా లో గ్రామణ ఉపాధి హామీ పథకం కింద కూలి లకు పనులు కలిపిస్తున్నా కొత్త పనులకు అనుమతి లభించడం లేదు.
ఎన్నికల ప్రవర్తనా ని యమావళి రెండు నెలలుగా అమలులో ఉండ టం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొం టున్నారు. పోలింగ్‌కు ఓట్ల లెక్కింపునకు మధ్య 16 రోజుల వ్యవధి ఉండటంతో పాటు లెక్కింపు అనంతరం మరో 12 రోజులు కూడా కోడ్ అమలులో ఉండటం ఇదే ప్రథమమని అంటున్నారు.
ప్రజావాణికి సైతం..
ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్ర తీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి కూడా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. నిత్యం ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకునేవారు. అయితే ఏకకాలంలో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు రావడంతో రెండు నెలలుగా కోడ్ అమలు జరుగుతుంది. ఈ కారణంగా ప్రజావాణికి వచ్చి తమ సమస్యలు చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో అంతా నిరాశకు గురవుతున్నారు.
ఆందోళనలకూ అడ్డంకి
తమకు అన్యాయం జరిగిందని ఆందోళనలు చేసే అవకాశం కూడా ప్రస్తుతం లేకుండాపోయింది. ప్రతీ ఆందోళన, నిరసన ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి కావడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తహశీల్దార్, ఆర్డీవో తదితర ప్రభుత్వ సంస్థల ఎదుట చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. సమాచారం లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు కావడం తీవ్ర ఇబ్బందలుకు గురికావాల్సి వస్తుందని భయాందోళనతో ఎవ్వరూ ఆందోళనల జోలికి వెళ్లడం లేదు. ఏదిఏమైనా ప్రజా సమస్యల కోసం నిత్యం తపించే ఉద్యమ సంఘాలకు ఈ కోడ్ ఉపశమనం ఇచ్చేలా చేసింది.
వీటికి దూరం
- ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదు.
- ప్రభుత్వ అతిథి గ ృహాలు వినియోగించరాదు.
- అధికారులతో సమావేశాలు నిర్వహించరాదు.
- ప్రభుత్వ స్థలాలను సభలు, సమావేశాలకు వినియోగించరావు.
- గ్రామాల్లో సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేపట్టరాదు.
- కొత్త నిర్మాణాలు చేపట్టరాదు.
- అధికారుల బదిలీలకు తావు లేదు.
- ఎవరూ కూడా ప్రదర్శనలు, రాస్తారోకోలు చేపట్టరాదు.
కొనసాగుతున్న ఎన్నికల ‘కోడ్’
Published Sat, May 3 2014 2:39 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement