మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణలో తొలి సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్ మొత్తానికి ప్రశాంతంగానే ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగగా తెలంగాణలో మాత్రం చట్టసభకు తొలి సభ్యులయ్యేందుకు అభ్యర్థులు వారి గెలుపు కోసం సర్వశక్తులొడ్డారు. ముగిసిన పోలింగ్ సంబంధించి ఫలితాలు ఈ నెల 16వ తేదీన ఎన్నికల లెక్కింపు జరగనుంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది. ఇప్పటికే ఎక్కడైనా నలుగురు కలిస్తే అభ్యర్థుల గెలుపు-ఓటములపై అంచనాలు వేసుకోవడం పరిపాటిగా మారింది.
అందరిలోనూ ఉత్కంఠ
ఎన్నికల ప్రక్రియ ముగిసిన రోజు నుంచి ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో కదిలించినా ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? అనే చర్చలు సాగుతున్నాయి. జిల్లాలో ఒక లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా దాదాపు ప్రతీ చోట త్రిముఖపోరు, ద్విముఖ పోరు కనిపించింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు గెలుపుపై ధీమా ఉన్న వారు సైతం పోలింగ్ సరళిని ఎవరికి వారే తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు.
జిల్లా అత్యధిక స్థానాలు తమవే అంటూ ఒకరు, లేదు మెజార్టీ స్థానాలు తమవే అని కొందరు ఇలా అంచనాలు వేస్తున్నారు. ఎక్కడెక్కడ విజయావకాశాలు ఉన్నాయి, ఏ గ్రామ పరిధిలో ఓట్లు అధికంగా వచ్చాయి అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం కూడా కలవరపెడుతోంది. లోలోపల కొంత ఓటమి భయం ఉన్నా బయటకు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అభ్యర్థులంతా తమ అదృష్టాన్ని తలుచుకుంటూ ఫలితాలు వెలుబడే వరకు నిరీక్షించక తప్పదు.
జిల్లాకేంద్రంలో ఈవీఎంలు
పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి 2,318 పోలిం గ్ కేంద్రాలు ఉండగా 3000 ఈవీఎంలను విని యోగించారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో ముందస్తు గా సిద్ధం చేసి ఉంచిన ఈవీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చి వినియోగించారు. ఎన్నిక ల అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకుల స మక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక మరో 13 రో జుల్లో ఫలితాలకు సమయం ఉండటంతో 16న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుంది.
స్ట్రాంగ్ రూంలలో భద్రం
మంచిర్యాల, సిర్పూర్, ఆసిఫాబాద్, ముథోల్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షే మ గురుకుల జూనియర్ కళాశాల(బాలుర)లో భద్రపరిచారు. ఖానాపూర్, చెన్నూర్, బెల్లంపల్లి, నిర్మల్, బోథ్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల(బాలికలు)లో భద్రపరిచారు. వీటికి పటిష్ట భద్రత కల్పించారు