new structures
-
భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం
మేరిల్యాండ్: శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ విశ్వానికి సంబంధించిన పలు రహస్యాలు కనుగొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా భూ అంతర్భాగానికి సంబంధించిన విషయాలు, రహస్యాలను తెలుసుకోవడానికి కూడా నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రం కింద ఉన్న భూమిలో పరిశోధనలు చేసి భూమి లోపల ఉండే మంటిల్ పొర వద్ద ఓ భారీ నిర్మాణాన్ని కనుగొన్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డోయోన్ కిమ్, అతని సహచరులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత మార్క్వాస్ దీవుల కింద ఉన్న భూమిలో ఓ కొత్త నిర్మాణాన్ని కనుగొన్నట్లు తెలిపారు. (జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్) వేల కిలోమిటర్ల అడుగున భూ అంతర్భంగంలోని ఈ నిర్మాణాన్ని కనుగొనడానికి భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే తరంగాల డేటాను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని భూమి లోపల 2900 కిలోమీటర్ల వద్ద గుర్తించామని తెలిపారు. అల్ట్రా లో వెలాసిటీ(యూఎల్‌వీ)జోన్ అని పిలువబడే ఈ నిర్మాణం 1000 కిలోమీటర్ల వ్యాసం, 25 కిలోమీటర్ల మందంతో ఉన్నట్లు కిమ్ తెలిపారు. భూకంపకాలు సంభవించినప్పుడు వచ్చే తరంగాలు భూమిలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ తరంగాల ప్రతిధ్వనుల సాయంతో భూమి ఉపరితల భౌతిక లక్షణాలతోపాటు భూగర్భంలోని పలు నిర్మాణాలను కనుగొనవచ్చుని పేర్కొన్నారు. దీనికోసం 1990 నుంచి 2018 వరకు పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతం చూట్టూ సంభవించిన సుమారు 7000 భూకంపాలకు సంబంధించిన తరంగాల రికార్డులను విశ్లేషించినట్లు డోయోన్ కిమ్ తెలిపారు.(వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) -
పాత స్థలాల్లో కొత్త నిర్మాణాలు!
రియల్ ఎస్టేట్, లొకేషన్! ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. మరి, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కాబట్టి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నాయి నిర్మాణ సంస్థలు! దీంతో పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో ప్రధాన నగరం నయా ప్రాజెక్ట్‌లతో కొనుగోలుదారులను రా.. రమ్మంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: 30–40 ఏళ్ల నాటి పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలౖకైతే వెయ్యి గజాల వరకు, అంతకంటే ఎక్కువగా.. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, విద్యానగర్, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావ్‌నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 90 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లే. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్ధిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని బేగంపేట్‌లో ‘రామ్ ఎన్క్లేవ్’ పేరిట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్న ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా పాత స్థలాలను రీ–డెవలప్మెంట్కు ఇచ్చేందుకు మరికొన్ని కారణాలున్నాయి. అవేంటంటే.. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ: రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు అగ్నిమాపక, విమానయాన, పర్యావరణ శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) పెద్దగా అవసరం ఉండదు. పైగా పాత స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటర్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్ స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. ఎవరికేం లాభమంటే? రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లతో స్థల యజమానులకు, నిర్మాణ సంస్థలకు, కొనుగోలుదారులకూ అందరికీ ప్రయోజనకరమే! స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలూ త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం తిరిగొస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. -
క్రమబద్ధీకరణలో అక్రమాలుండవు: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా.. అవకతవకలకు తావు లేకుండా పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు కృషి చేయనున్నట్లు పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం రెవెన్యూ శాఖ బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దశాబ్దాలుగా అధికారికంగా రిజిస్ట్రేషన్లు లేక 125 గజాలలోపు ఇళ్లలో నివసిస్తున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని, వారంతా సీఎం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ విధానంతో ఇళ్లు అమ్ముకోవాలనుకున్నా, కూల్చివేసి కొత్తగా నిర్మాణాలు చేసుకోవాలన్నా ఇకపై ఇబ్బంది ఉండదని చెప్పారు. అన్యాక్రాంతమైన విలువైన భూములను కాపాడడం, దళితులకు భూ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సారథ్యంలో ఆయనతో కలసి రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్లు వివరించారు. -
కొనసాగుతున్న ఎన్నికల ‘కోడ్’
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. మరో 26 రోజుల పాటు కోడ్ అమలులోనే ఉం డనుంది. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరగనుంది. ఆ తదనంతర ప్రక్రియ లు, లాంఛనాలు అన్నీ ముగిసే వరకు.. అంటే ఈ నెల 28వ తేదీ వరకు కోడ్ అమలులో ఉం టుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు, నూతన నిర్మాణాలకు మోక్షం లభించే మార్గాలు కనిపించడం లేదు. అభివృద్ధి మాటే లేదు జిల్లాలో అభివృద్ధిపై స్తబ్ధత నెలకొంది. సార్వత్రి క ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఒక్కసారి గా రాజకీయ వాతావరణం చల్లబడింది. అయి తే అధికారిక కార్యక్రమాలు మాత్రం కుంటుపడ్డాయి. అభివృద్ధి పనులకు, నిధుల మంజూరుకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారడంతో ప్రజాప్రతినిధులు సైతం డీలా పడిపోతున్నారు. జిల్లా లో గ్రామణ ఉపాధి హామీ పథకం కింద కూలి లకు పనులు కలిపిస్తున్నా కొత్త పనులకు అనుమతి లభించడం లేదు. ఎన్నికల ప్రవర్తనా ని యమావళి రెండు నెలలుగా అమలులో ఉండ టం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొం టున్నారు. పోలింగ్‌కు ఓట్ల లెక్కింపునకు మధ్య 16 రోజుల వ్యవధి ఉండటంతో పాటు లెక్కింపు అనంతరం మరో 12 రోజులు కూడా కోడ్ అమలులో ఉండటం ఇదే ప్రథమమని అంటున్నారు. ప్రజావాణికి సైతం.. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్ర తీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి కూడా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. నిత్యం ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకునేవారు. అయితే ఏకకాలంలో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు రావడంతో రెండు నెలలుగా కోడ్ అమలు జరుగుతుంది. ఈ కారణంగా ప్రజావాణికి వచ్చి తమ సమస్యలు చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో అంతా నిరాశకు గురవుతున్నారు. ఆందోళనలకూ అడ్డంకి తమకు అన్యాయం జరిగిందని ఆందోళనలు చేసే అవకాశం కూడా ప్రస్తుతం లేకుండాపోయింది. ప్రతీ ఆందోళన, నిరసన ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి కావడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తహశీల్దార్, ఆర్డీవో తదితర ప్రభుత్వ సంస్థల ఎదుట చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. సమాచారం లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు కావడం తీవ్ర ఇబ్బందలుకు గురికావాల్సి వస్తుందని భయాందోళనతో ఎవ్వరూ ఆందోళనల జోలికి వెళ్లడం లేదు. ఏదిఏమైనా ప్రజా సమస్యల కోసం నిత్యం తపించే ఉద్యమ సంఘాలకు ఈ కోడ్ ఉపశమనం ఇచ్చేలా చేసింది. వీటికి దూరం - ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదు. - ప్రభుత్వ అతిథి గ ృహాలు వినియోగించరాదు. - అధికారులతో సమావేశాలు నిర్వహించరాదు. - ప్రభుత్వ స్థలాలను సభలు, సమావేశాలకు వినియోగించరావు. - గ్రామాల్లో సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేపట్టరాదు. - కొత్త నిర్మాణాలు చేపట్టరాదు. - అధికారుల బదిలీలకు తావు లేదు. - ఎవరూ కూడా ప్రదర్శనలు, రాస్తారోకోలు చేపట్టరాదు.