మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు | majority in seats TRS win | Sakshi
Sakshi News home page

మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు

Published Mon, Apr 21 2014 1:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు - Sakshi

మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు

కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ : ఈ నెల 30వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 23న కోదాడకు రానున్న సందర్భంగా నిర్వహించే బహిరంగసభ ప్రాంగణం, హెలిప్యాడ్‌ను నరేందర్‌రెడ్డి ఆదివారం  పరిశీలించారు.

అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను తమ సొంత ఇంటి అభ్యర్థులుగా భావిస్తూ జిల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మా జీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించి వారి చెప్పుచేతల్లో నడుచుకున్నాడని విమర్శించారు. ప్రస్తుతం ఉత్తమ్‌కు వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా సీమాంధ్రులు తమ స్వలాభం కోసం ఇప్పించిందేనని, ఉత్తమ్ గెలిస్తే సీమాంధ్రుల మెప్పుకోసం తెలంగాణను తాకట్టుపెడతాడని ఆరోపించారు.

 పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏనాడూ నోరుమెదపని ఆయన తెలంగాణను అభివృద్ధి చేస్తాననడం హా స్యాస్పదమన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీగా మారిందని విమర్శించే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.

 రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను గమనించిన తెలంగాణ ప్రజలు  టీడీపీ, బీజేపీ కూటమిని ఆదరించేందు కు సిద్ధంగాలేరన్నరు. సమావేశంలో కోదాడ ఎ మ్మెల్యే అభ్యర్థి శశిధర్‌రెడ్డి, జిల్లా అధికా ర ప్రతి నిధి బక్క పిచ్చయ్య, రాష్ట్ర కార్యదర్శి  బ్రహ్మానందం, శ్రీనివాస్, గోవిందరాంసింగ్, కుక్కడపు బాబు, పుల్లయ్య, అంజయ్య,లక్ష్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement