Banda narendarreddy
-
టీడీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బండా నరేందర్‌రెడ్డి కోదాడ అర్బన్ : ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వంతపాడుతున్న తెలంగాణ టీడీపీ నాయకులు ఇకనైనా తమ తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు హితవు పలికారు. శనివారం కోదాడలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చంద్రబాబునాయుడుకు మద్దతు తెలిపే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. టీన్యూస్ చానల్‌కు నోటీసులు జారీచేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రాష్ట్ర నాయకుడు తేరా చిన్నపురెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పార సీతయ్య, చిలుకూరు ఎంపీపీ బి.నాగేంద్రబాబు, నాయకులు డేగ బాబు, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, బూత్కూరి వెంకటరెడ్డి, కె.బాబు, కోటేశ్వరరావు ఉన్నారు. ఉప ఎన్నికల్లో పోటీపై త్వరలోనే నిర్ణయం జూలై 4న జరిగే నడిగూడెం జెడ్పీటీసీ, మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ ఉప ఎన్నికల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిపితే వారికి మద్దతిస్తామని నరేందర్‌రెడ్డి ప్రకటించారు. పార్టీల పరంగా అభ్యర్థులు పోటీలో ఉంటే తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపే విషయంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామన్నారు. -
మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ : ఈ నెల 30వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 23న కోదాడకు రానున్న సందర్భంగా నిర్వహించే బహిరంగసభ ప్రాంగణం, హెలిప్యాడ్‌ను నరేందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థులను తమ సొంత ఇంటి అభ్యర్థులుగా భావిస్తూ జిల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మా జీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించి వారి చెప్పుచేతల్లో నడుచుకున్నాడని విమర్శించారు. ప్రస్తుతం ఉత్తమ్‌కు వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా సీమాంధ్రులు తమ స్వలాభం కోసం ఇప్పించిందేనని, ఉత్తమ్ గెలిస్తే సీమాంధ్రుల మెప్పుకోసం తెలంగాణను తాకట్టుపెడతాడని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏనాడూ నోరుమెదపని ఆయన తెలంగాణను అభివృద్ధి చేస్తాననడం హా స్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిందని విమర్శించే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను గమనించిన తెలంగాణ ప్రజలు టీడీపీ, బీజేపీ కూటమిని ఆదరించేందు కు సిద్ధంగాలేరన్నరు. సమావేశంలో కోదాడ ఎ మ్మెల్యే అభ్యర్థి శశిధర్‌రెడ్డి, జిల్లా అధికా ర ప్రతి నిధి బక్క పిచ్చయ్య, రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మానందం, శ్రీనివాస్, గోవిందరాంసింగ్, కుక్కడపు బాబు, పుల్లయ్య, అంజయ్య,లక్ష్మయ్య పాల్గొన్నారు.